Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:33 PM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రుద్ర తాండవం చేయడానికి సిద్దమయ్యాడు. అఖండ 2 (Akhanda 2)నుంచి మొదటి సాంగ్ ప్రోమో వచ్చేసింది.

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రుద్ర తాండవం చేయడానికి సిద్దమయ్యాడు. అఖండ 2 (Akhanda 2)నుంచి మొదటి సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దిగా లేట్ గా వచ్చినా కూడా ఫ్యాన్స్ ఈ ప్రోమో నిరాశపర్చలేదు అని చెప్పొచ్చు. అఖండ తాండవం.. హరహర మహాదేవ అంటూ సాగిన సాంగ్ కు బాలయ్య తాండవం చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఆ అఘోర గెటప్ లో మంచు పర్వతాల మధ్య.. ఒంటినిండా బూడిద పూసుకొని పూనకం వచ్చినట్లు ఊగుతుంటే.. ఈ షాట్ కి థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.

బాలయ్య - బోయపాటి హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక వీరికి తోడు నందమూరి థమన్ కలవడంతో అఖండ.. తాండవం కు ఫ్యాన్స్ ఊగిపోతారు అని చెప్పొచ్చు. ఆ సౌండ్స్ కి, హరహర మహాదేవ అనే లైన్స్ కి ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించారు. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంది అంటే సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక అఖండ తాండవం ఫుల్ సాంగ్ నవంబర్ 14 న రిలీజ్ కానుంది. ఇక అఖండ 2 డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ హిట్ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Keerthy Suresh: మహానటి లైనప్ చూస్తే మెంటలొచ్చేస్తుందిగా..

Rajamouli: జక్కన్నపై మళ్ళీ కాపీ ఆరోపణలు

Updated Date - Nov 07 , 2025 | 08:33 PM