Actress: సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్...
ABN , Publish Date - Jul 17 , 2025 | 08:52 AM
సినిమా నటీనటులుకు గౌరవ డాక్టరేట్ రావడం కొత్తేమీ కాదు. అయితే సినిమా రంగానికి చేసే సేవకు గుర్తింపుగా సహజంగా వారికి డాక్టరేట్ లభిస్తుంది. కానీ నటి సంచితాశెట్టికి యువ నాయకురాలిగా ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ వచ్చింది.
మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ప్రముఖ నటి సంచితాశెట్టి (Sanchita Shetty). తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది సంచితా శెట్టి. ఆమె విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్’ (Soodhu Kavvaum), అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ‘విల్లా’ (Villa) తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ (Bagheera) చిత్రాలలో నటించింది. వివిధ భాషల్లో దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. నటనతో పాటు సంచిత చేసిన యూత్ లీడర్ షిప్ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్ మథర్ థెరిసా యూనివర్సిటీ వారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.
Also Read: Akhanda 2: అస్సలు తగ్గేదేలే.. ఓజీతో అఖండ యుద్దానికి సిద్ధం
Also Read: The Girlfriend: పాటేంటి.. ఇంత వెరైటీగా ఉంది