The Girlfriend: పాటేంటి.. ఇంత వెరైటీగా ఉంది

ABN , Publish Date - Jul 16 , 2025 | 10:30 PM

కుబేర త‌ర్వాత తెలుగులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా న‌టిస్తోన్న చిత్రం ది గ‌ర్ల్ ఫ్రెండ్.

rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్‌, టాలీవుడ్‌ల‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అయితే కుబేర త‌ర్వాత తెలుగులో రాహుల్ ర‌వీంద్ర‌న్ (Rahul Ravindran) ద‌ర్శ‌క‌త్వంలో ది గ‌ర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) అనే సినామాలో లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ద‌స‌రా ఫేమ్‌ దీక్షిత్ షెట్టి (Dikshith Shetty) హీరోగా కనిపిస్తుండ‌గా గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ న‌దివే.. నువ్వు నదివే అంటూ సాగే ఓ పాట‌ను మేకర్స్ బుధ‌వారం విడుద‌ల చేశారు. రాకేందు మౌళి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ కు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hashem Abdul Wahab) సంగీతం అందించాడు అయితే ఈ పాట డ్యాన్స్‌తో పాటు, సాహిత్యం అంతా డిఫ‌రెంట్‌గా ఉండి ప్రేక్ష‌కుల‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా పాట‌లో ఇక ఈ పాట‌లో రష్మిక, దీక్షిత్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండ‌గా.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంది. పాట చూస‌న వారంతా పాటేంటి ఇంత వెరైటీగా ఉంది.. ఇలా కూడా తీస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ మారు ఆ పాట‌పై లుక్కేయండి మ‌రి.

Updated Date - Jul 17 , 2025 | 07:02 AM