Akhanda 2: అస్సలు తగ్గేదేలే.. ఓజీతో అఖండ యుద్దానికి సిద్ధం

ABN , Publish Date - Jul 16 , 2025 | 10:44 PM

ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ జరగడం సర్వ సాధారణం. కానీ, ఈ స్టార్ హీరోల మధ్య పోటీ.. సినిమాల మధ్య కాకుండా అభిమానుల మధ్య జరుగుతుంది.

Akhanda 2

Akhanda 2: ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ జరగడం సర్వ సాధారణం. కానీ, ఈ స్టార్ హీరోల మధ్య పోటీ.. సినిమాల మధ్య కాకుండా అభిమానుల మధ్య జరుగుతుంది. అందులోనూ ఈసారి ఈ ఇద్దరు హీరోల మధ్య బంధం వేరు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ ఇద్దరూ హీరోలు ఎవరు.. ? ఆ సినిమాలు ఏంటి.. ? అనేది తెలిసిపోయే ఉంటుంది. అవును అవే అఖండ 2 (Akhanda 2) మరియు ఓజీ(OG). ఈ సినిమాల కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇక గతేడాది రిలీజ్ రావాల్సిన సినిమా చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ కు రెడీ కానుంది.


ఇక ఓజీ సినిమా రిలీజ్ రోజునే అఖండ 2 కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. ఈసారి అఖండ తాండవం అంతకు మించి బోయపాటి చూపించబోతున్నాడు. ఇప్పటికే అఖండ 2 నుంచి రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేసింది. బోయాపాటి- బాలకృష్ణ - థమన్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.


ఇక అఖండ 2 మొదటి నుంచి సెప్టెంబర్ 25 నే రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. కొన్నిరోజులు ఓజీ వెనక్కి తగ్గుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఫైరింగ్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు అఖండ 2 రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ పూర్తికాలేదని, కొన్ని కీలకమైన షెడ్యూల్స్ చేయాల్సి ఉందని, అది ఇప్పుడప్పుడే అయ్యేలా లేదని.. అందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ కాకుండా డిసెంబర్ లో అఖండ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.


తాజాగా అఖండ 2 వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా చెప్పిన డేట్ కే అఖండ 2 వస్తుందని తెలిపారు. ఒక సాంగ్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తయ్యిందని, ఆగస్టు 14లోపు మొదటి కాపీని కూడా రెడీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, సెప్టెంబర్ 25 అఖండ 2 రిలీజ్ కానున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక మేకర్స్ ఇంత క్లారిటీ ఇవ్వడంతో ఈసారి బాలయ్య - పవన్ ల మధ్య యుద్ధం తప్పనిసరి అని తెలుస్తోంది. ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా ఒకే ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఈసారి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు.. ? ఎవరుఓడతారు ..? అనేది తెలియాల్సి ఉంది.

Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలోప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

8 Vasanthalu: థియేటర్ లో వేస్ట్.. ఓటీటీలో బెస్ట్

Updated Date - Jul 16 , 2025 | 10:45 PM