Maareesan: ఓటీటీకి వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా .. ఎందులో చూడొచ్చంటే
ABN, Publish Date - Aug 17 , 2025 | 04:58 PM
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్(Fahadh Faasil) వరుస సినిమాలతో బిజీగా మారాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు.
Maareesan: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్(Fahadh Faasil) వరుస సినిమాలతో బిజీగా మారాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఫహాద్ నుంచి వచ్చిన చిత్రాల్లో మారీశన్(Maareesan) ఒకటి. స్టార్ కమెడియన్ వడివేలు(Vdivelu) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 25 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఫహాద్, వడివేలు కాంబో ఇప్పటికే మామన్నన్ సినిమాలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మారీశన్ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 22 నుంచి మారీశన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫహాద్ ప్రతి సినిమా థియేటర్ లో తెలుగులో రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మాత్రం తెలుగులో డబ్ అవుతాయి. మారీశన్ కూడా తెలుగుతో పాటు అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది. ఈ సినిమాలో ఫహాద్ దొంగగా నటించగా.. వడివేలు అల్జీమర్స్ ఉన్న వృద్దుడిగా కనిపించాడు.
కథ విషయానికొస్తే.. దయాలన్ (ఫహాద్ ఫాసిల్) ఒక దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. అతనికి వేలాయుధం( వడివేలు) దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉందని తెలుస్తోంది. ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని చూస్తాడు. అయితే వేలాయుధానికి అల్జీమర్స్. ఏ విషయాన్నీ కానీ, మనుషులను కానీ వెంటనే మర్చిపోతూ ఉంటాడు. ఇక వేరే ఊరులో ఉన్న ఫ్రెండ్ ను కలవడానికి వేలాయుధం వెళ్తున్నాడని తెలుసుకున్న దయాలన్ మాయమాటలు చెప్పి, వేలాయుధాన్ని తన బండిపై తీసుకెళ్లడానికి ఒప్పిస్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది. దయాలన్ అనుకున్నది సాధించాడా.. ? వేలాయుధంతో అతడు పడిన ఇబ్బందిలు ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్ లో అంతగా మెప్పించని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ చూశారా
Ghattamaneni Bharathi: మహేష్ బాబు వారసురాలి టాలీవుడ్ ఎంట్రీ షురూ