Ghattamaneni Bharathi: మహేష్ బాబు వారసురాలి టాలీవుడ్ ఎంట్రీ షురూ

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:04 PM

ఏంటి.. నిజమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వారసురాలు సితార(Sitara) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా.. ? అని షాక్ అవ్వకండి. మహేష్ బాబు వారసురాలే.. కానీ సితార కాదు. మహేష్ అన్న రమేష్ బాబు కూతురు భారతి(Bharathi).

Bharathi

Ghattamaneni Bharathi: ఏంటి.. నిజమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వారసురాలు సితార(Sitara) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా.. ? అని షాక్ అవ్వకండి. మహేష్ బాబు వారసురాలే.. కానీ సితార కాదు. మహేష్ అన్న రమేష్ బాబు కూతురు భారతి(Bharathi). సూపర్ స్టార్ కృష్ణ తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి చిన్నతనంలోనే పరిచయం చేశాడు. అయితే మహేష్ బాబు సక్సెస్ అయ్యినట్టు.. రమేష్ బాబు అవ్వలేకపోయాడు. అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకొని బిజినెస్ లు చూసుకున్నాడు. ఇక అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే రమేష్ బాబు మరణించిన విషయం తెల్సిందే.


రమేష్ బాబు మరణం తరువాత ఆయన పిల్లల బాధ్యతను మహేష్ తీసుకున్నాడు. తండ్రి లేని లోటును వారికి తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పటికే రమేష్ బాబు కొడుకు జయకృష్ణను టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం చేశారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన అజయ్ భూపతి.. జయకృష్ణను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడని టాక్. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక జయకృష్ణ తో పాటు అతని చెల్లి భారతి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సితారతో పాటు భారతి కూడా ఈమధ్య ప్రతి వీడియోలో కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


విదేశాల్లో చదువుకుంటున్న భారతి ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ కు తేజ ఎంతోమంది హీరో, హీరోయిన్లను పరిచయం చేశాడు. ఇప్పుడు తన సొంత కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఆ సినిమాతోనే హీరోయిన్ గా భారతిని సెలెక్ట్ చేశారని, దీనికి మహేష్ కూడా ఓకే చెప్పాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక తేజ చేతిలో పడితే నటులు ఎవరైనా సరే సక్సెస్ ను అందుకోవాల్సిందే. ఇప్పుడు భారతి కెరీర్ గురించి అస్సలు డోకా లేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే తేజ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాడు. మరి ఈ సినిమాతో భారతి.. బాబాయ్ పేరును నిలబెడుతుందేమో చూడాలి.

Bobby Deol: స్టార్ హీరోయిన్ నోటి నుంచి గబ్బు వాసన.. ముద్దు పెట్టనన్న యానిమల్ విలన్

Actress: నటి రాజసులోచన 91వ జయంతి... సేవా కార్యక్రమాలు

Updated Date - Aug 17 , 2025 | 03:04 PM