Pooja Hegde: పూజా పాపను ఇక ఈ రాముడే గట్టెక్కించాలి
ABN, Publish Date - Sep 10 , 2025 | 07:38 PM
బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hagde) కొన్నేళ్ల నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hagde) కొన్నేళ్ల నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. అమ్మడు పట్టుకున్న ప్రతిదీ పరాజయమే. దీంతో పూజాను అందరూ ఐరెన్ లెగ్ కింద మార్చేశారు. మధ్యలో ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన పూజా.. గతేడాది రెట్రో అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చింది. సూర్య సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా తమిళ్ లో ఓ మోస్తరుగా మెప్పించిందేమో కానీ, తెలుగులో పరాజయాన్నే అందుకుంది.
ఇక రెట్రో తరువాత పూజాను గత్తెక్కించే నాధుడే లేడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలోనే నేనున్నాగా అంటూ రాముడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యో రాముడు అంటే దేవుడు కాదు.. సీతారామం సినిమాలో రాముడు.. అదేనండీ దుల్కర్ సల్మాన్. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న దుల్కర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో DQ41 ఒకటి. రవి నేలకుడితి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. తాజాగా ఈ చిత్రంలో దుల్కర్ సరసన పూజా హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సెట్ లో పూజా, దుల్కర్ పై చిత్రీకరిస్తున్న సన్నివేశాలను చూపించారు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. పూజాకు ఇది చాలా లక్కీ ఛాన్స్. కనీసం దుల్కర్ అయినా పూజాను గట్టెక్కిస్తాడేమో చూడాలి.
Nayanthara: మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్న నయనతార
Akkineni Family: అక్కినేని చిన్న కోడలు బర్త్ డే.. కానరాని శోభిత