Nayanthara: మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్న నయనతార

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:20 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).. వివాదం ఆమెను వెతుక్కుంటూ వస్తుందో.. లేక ఆమె వివాదాన్ని వెతుక్కుంటూపోతుందో చెప్పడం చాలా కష్టం.

Nayanthara

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).. వివాదం ఆమెను వెతుక్కుంటూ వస్తుందో.. లేక ఆమె వివాదాన్ని వెతుక్కుంటూపోతుందో చెప్పడం చాలా కష్టం. ఒక సమస్య తీరింది అనుకుంటే.. ఇంకో సమస్యతో మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటుంది. నయన్ కొన్నేళ్లు ప్రేమించి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి డాక్యుమెంటరీని ఈ ఇద్దరు భార్యాభర్తలు నెట్ ఫ్లిక్స్ కు అమ్మేశారు. ఇక నెట్ ఫ్లిక్స్ .. నయన్ పెళ్లి డాక్యుమెంటరీని దాచుకొని దాచుకొని.. గతేడాది స్ట్రీమింగ్ చేసింది.


ఇక ఈ డాక్యూమెంటరీలో నయన్, ప్రేమ, పెళ్లి.. మొత్తాన్ని తనకు నచ్చినట్లు చెప్పుకొచ్చింది. మధ్యలో ఆమె నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కూడా వాడింది. అదే ఇక్కడ పెద్ద సమస్య అయ్యింది. మేకర్స్ అనుమతి లేకుండా.. వారికి ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా నయన్ స్వంత సంస్థ అన్నట్లు ఆ డాక్యుమెంటరీలో సినిమా క్లిప్స్ ను వాడేసింది. దీంతో నిర్మాత ధనుష్.. కోర్ట్ కి ఎక్కాడు. ఆయన బ్యానర్ లో వచ్చిన నేను రౌడీనే సినిమా సమయంలో చిత్రీకరించిన మేకింగ్ ఫోటోస్ అయినా కూడా తమ పర్మిషన్ లేకుండా వాడడం తప్పు అని తెలుపుతూ కేసు వేశాడు.


ఆ సినిమాలోని క్లిప్స్ ను తొలగించి.. రూ. 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక ఇంకోపక్క నెట్ ఫ్లిక్స్ ధనుష్ పై మరో కేసు వేసింది. ఆ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఇక ఈ వివాదం సద్దుమణిగింది అనుకొనేలోపు.. మరో సినిమా మేకర్స్ నయన్ పై ఇంకో కేసు వేశారు. చంద్రముఖి సినిమాలోని సీన్స్ ను తమ పర్మిషన్ లేకుండా వాడరని ఏబీ ఇంటర్నేషనల్.. మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఇక విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అసలు ఈ క్లిప్స్ సంగతి ఏంటి అనే విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని డాక్యుమెంటరీ నిర్మించిన టార్క్ స్టూడియోకు నోటీసులు జారీ చేసింది.


అంతేకాకుండా ఏబీ ఇంటర్నేషనల్ కోరిన విధంగా ఆ డాక్యుమెంటరీలోని సీన్స్ ను తొలగించి, వారికి రూ. 5 కోట్లు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. ఇంకా ఆ డాక్యుమెంటరీలో చంద్రముఖి సీన్స్ ను తొలగించకుండా ప్లే చేస్తున్నారని మరోసారి ఏబీ ఇంటర్నేషనల్.. పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే మా క్లిప్స్ ను తొలగించి, ఇప్పటివరకు ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి పుటేజ్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని తమకు ఇప్పించాల్సిందిగా కోరింది. మరి ఈ వివాదంపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Chiranjeevi: మరో వారసుడికి స్వాగతం పలికిన మెగాస్టార్

Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్ గారిని కలిసిన పూరిసేతుపతి

Updated Date - Sep 10 , 2025 | 06:20 PM