Diljit Dosanjh: 'కాంతార ఛాప్టర్ 1' కోసం పంజాబీ సింగర్
ABN, Publish Date - Sep 11 , 2025 | 05:47 PM
'కాంతార'కు మరో అట్రాక్షన్ యాడ్ అయింది. నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్స్ ను పెంచేందుకు అదిరిపోయే ఐడియాను ఇంప్లిమెంట్ చేశారు. ఇక అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద డోకా ఉండబోదని అనుకుంటున్నారు.
మూవీ లవర్స్ ఎగ్జయిటెడ్ గా ఎదురుచూస్తున్న మూవీల్లో 'కాంతార చాప్టర్ 1' (Kantara – Chapter 1) ఒకటి. హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) పై నిర్మాత విజయ్ కిరగందూర్ (Vijay Kiragandu) నిర్మిస్తున్న ఈ ప్రీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి . 'కాంతార' (Kantara) హిట్ కావడానికి కారణాల్లో 'వరాహ రూపం' ( Varaha Roopam) అనే పాట కూడా ఒకటి. సినిమాకే హైలైట్ గా నిలిచిన ఈ పాట వింటూ చాలా మంది మైమరిచిపోయారు. దీంతో ప్రీక్వెల్ లో నూ అలాంటి అట్రాక్షన్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సౌత్, నార్త్ తో పాటు గ్లోబల్ ఆడియెన్స్ మెప్పించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
'కాంతార చాప్టర్ 1' కోసం పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. తన ఎనర్జిటిక్ పాటలతో పూనకాలు తెప్పించే సింగర్... ఈ సినిమాలో ఒక పాట పాడబోతున్నాడట. దోసాంజ్ గొంతు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అందుకే ఓ పాటను పాడించాలనుకుంటున్నారట మేకర్స్. అంతేకాక ఈ సాంగ్ రికార్డింగ్ ముంబైలోని YRF స్టూడియోలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ పాన్ వరల్డ్ గా రాబోతుండటంతో దోసాంజ్ గొంతు నార్త్ లోనే కాదు గ్లోబల్ లెవల్ రీచ్ కు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. దోసాంజ్ పాట 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) లోని 'భైరవ యాంథమ్' (Bhairava Anthem) పాట పాడారు. ఇప్పుడు ఆ పాటలాగే సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.
'కాంతార ఛాప్టర్ 1' విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని బిగ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంచనాలు పెంచింది. ప్రెజెంట్ పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.ఈ మూవీ కోసం 20 మంది VFX స్టూడియోలు ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నాయట. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 20 న ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరోవైపు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు రూ. 125 కోట్ల రూపాయలకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ కు ముందే దుమ్ములేపేలా కనిపిస్తోంది. అలాంటి ఈ మూవీ దిల్జీత్ పాట పాడనున్నట్లు తెలియడంతో ఆంచనాలు పెరిగిపోవడంతో పాటు ఆ సాంగ్ విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తన స్టేజ్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిల్జీత్.. ఈ పాట తో కన్నడ చిత్రసీమలోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Kantara Chapter1: కేరళలో.. కాంతార1పై నిషేదం?
Read Also: Shah Rukh - Deepika: రాజస్థాన్‌లో షారుక్, దీపికకు ఊరట..