Shah Rukh - Deepika: రాజస్థాన్‌లో షారుక్, దీపికకు ఊరట..
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:59 PM
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణెలకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. కార్ల కంపెనీ ప్రచారంతో కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేసులో షారుక్, దీపికా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే!
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్(Shahrukh Khan), దీపికా పదుకొణెలకు (Deepika Padukone) రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. కార్ల కంపెనీ ప్రచారంతో కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేసులో షారుక్, దీపికా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే! హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికాలపై ఆగస్టులో రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ (Keerthi singh) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నటీనటులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును పరిశీలించిన కోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
అసలు విషయంలోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ రూ.23 లక్షలు పెట్టి హ్యుందాయ్ అల్కాజర్ కారును కొనుగోలు చేశారు. ఆ కారులో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందని పోలీసులను ఆశ్రయించారు. హ్యుందాయ్ కంపెనీ, డీలర్‌షిప్ వారు కారును రిపేర్ చేయడానికి నిరాకరించడంతో.. కంపెనీ అధికారులతోపాటు దీనికి ప్రచారకర్తలుగా ఉన్న షారుక్, దీపికాపై ఫిర్యాదు చేశారు. కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని.. కంపెనీ అధికారులతోపాటు ప్రమోట్ చేసిన వాళ్లు కూడా బాధ్యులేనని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షారుక్‌ఖాన్ 1998 నుంచి హ్యుందాయ్‌కు ప్రచారకర్తగా ఉన్నారు. దీపిక 2023 నుంచి ప్రమోట్ చేస్తున్నారు.
READ ALSO: Sivakarthikeyan: నా దైవం నుంచి అభినందనలు.. ఇంకేం కావాలి..
Kishkindhapuri: కిష్కిందపురి.. ప్రీమియర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా
Malavika Mohanan: ఇలాంటి అవకాశం ఎవరికైనా లభిస్తుందా