Idly Kottu Trailer: ఇడ్లీ కొట్టు ట్రైలర్.. ధనుష్ కి మరో హిట్ గ్యారెంటీ
ABN, Publish Date - Sep 20 , 2025 | 08:10 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. నిజం చెప్పాలంటే ఆయన ఏది పట్టుకున్నా బంగారంగానే మారుతుంది.
Idly Kottu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. నిజం చెప్పాలంటే ఆయన ఏది పట్టుకున్నా బంగారంగానే మారుతుంది. హీరోగా సక్సెస్, డైరెక్టర్ గా సక్సెస్, నిర్మాతగా సక్సెస్.. ఇలా ఏ సినిమాలో అయినా ధనుష్ ఉన్నాడు అంటే అది కచ్చితంగా విజయాన్ని అందుకుంటుంది. ఇక తాజాగా ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కొట్టు (Idly Kottu). డాన్ పిక్చర్స్ & వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఆకాష్ భాస్కరన్ ధనుష్ మరియు ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఇడ్లీ కొట్టు సినిమాలో ధనుష్ సరసన నిత్యా మీనన్, షాలిని పాండే నటిస్తుండగా.. అరుణ్ విజయ్ , సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎప్పటిలానే ధనుష్ ఈసారి కూడా సెంటిమెంట్ తో కొట్టేశాడు. తండ్రికొడుకుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చాలా ఎక్కువ చూపించబోతున్నారని తెలిసింది.
కథ విషయానికొస్తే.. మురళీ (ధనుష్) వాళ్ల నాన్న కుల వృత్తి ఇడ్లీ కొట్టు. గ్రామంలో వారి ఇడ్లీ కొట్టు చలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామనికే మూల స్తంభం ఆ ఇడ్లీ కొట్టు. తండ్రిలానే మురళీ కూడా చెఫ్ అవుతాడు. కానీ, తండ్రి కొట్టు కాకుండా సిటీలో అశ్విన్ (అరుణ్ విజయ్) తండ్రి రెస్టారెంట్ లో చెఫ్ గా చేరతాడు. అతడు వచ్చాకా ఆ రెస్టారెంట్ షేర్స్ బాగా పెరుగుతాయి. అది అశ్విన్ కి నచ్చదు. ఎంత కష్టపడి పనిచేసినా మురళీని పనోడిగానే చూస్తారు. ఇంకోపక్క కొడుకు తన వారసత్వాన్ని వదిలి బయట పనిచేయడం ఇష్టం లేని మురళీ తండ్రి మరణిస్తాడు.
ఇక మురళీ.. తన తండ్రి చివరి మాట వలన స్వంత వూరికి చేరుకొని తండ్రి ఇడ్లీ కొట్టునే నడపడం మొదలుపెడతాడు. మురళీ వెళ్లిపోవడంతో అశ్విన్ రెస్టారెంట్ కుప్పకూలుతుంది. దీంతో అశ్విన్.. మురళీ ఇడ్లీ కొట్టును ఏం చేశాడు.. ? తండ్రి మాట వినకుండా అశ్విన్.. మురళీపై పగ ఎలా తీర్చుకున్నాడు.. ? అసలు మురళీ జీవితంలోకి వచ్చిన కళ్యాణి ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ధనుష్ సినిమా అంటే.. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే అంశాలు ఉంటాయి. ఇడ్లీ కొట్టు ఒక తండ్రి కలను కొడుకు ఎలా నిజం చేశాడు. ఆయన గౌరవాన్ని ఎలా కాపాడాడు. ట్రైలర్ లో కూడా తండ్రీకొడుకుల బాండింగ్ ను బాగా చూపించారు. సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం మరో హైలెట్. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. కచ్చితంగా ధనుష్ మరో హిట్ అందుకోవడం గ్యారెంటీ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.
Actress Hema: మీ అక్కను బాడీ షేమింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావ్ మంచు విష్ణు
Oscar Entry: సక్సెస్ మూవీస్ ను పక్కన పెట్టి 'హోమ్ బౌండ్'కు ఓటు...