సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Court: కేజీఆర్ హీరోగా శ్రీదేవి కొత్త సినిమా

ABN, Publish Date - Jul 07 , 2025 | 05:54 PM

'కోర్టు' ఫేమ్ శ్రీదేవి ఇప్పుడో తెలుగు, తమిళ చిత్రం చేస్తోంది. కేజీఆర్ అనే యువ కథానాయుడి సరసన ఆమె నటించబోతోంది.

తెలుగు, తమిళ భాషల్లో 'గుర్తింపు' (Gurthimpu) పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా (Court Drama) తో హీరోగా పరిచయమవుతోన్న కేజేఆర్ (KJR) హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల 'మార్క్ ఆంటోనీ' (Mark Antony) చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఎస్. వినోద్ కుమార్ దీని నిర్మాత.


తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్యరాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. 'కోర్ట్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, పి.వి. శంకర్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.

Also Read: Oh Bhama Ayyo Rama: టాలీవుడ్ ఎంట్రీ అదుర్స్...

Also Read: Rashmika Mandanna: వాళ్ళు నన్ను దేనికి పిలవడం లేదు.. బాధగా ఉంది

Updated Date - Jul 07 , 2025 | 05:55 PM