Oh Bhama Ayyo Rama: టాలీవుడ్ ఎంట్రీ అదుర్స్...
ABN , Publish Date - Jul 07 , 2025 | 05:20 PM
సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది తమిళ చిత్రం 'జో' ఫేమ్ మాళవిక మనోజ్. జులై 11న మూవీ విడుదల సందర్భంగా తన మనోభావాలను మాళవిక పంచుకుంది.
మాళవిక మనోజ్ (Malavika Manoj) తొలి తెలుగు సినిమా 'ఓ భామ అయ్యో రామ' (Oh Bhama Ayyo Rama). ఈ సినిమాలో సత్యభామ (Saytabhama) అనే పాత్రను పోషించింది మాళవిక. ఈ సినిమా గురించి తన కెరీర్ గురించి ఆమె చెప్పిన విశేషాలివి.
అవకాశం ఎలా వచ్చిందంటే...
నేను తమిళంలో నటించిన చిత్రం 'జో'లో నా అభినయం చూసి దర్శకుడు రామ్ 'ఓ భామ అయ్యో రామ' చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నాడు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది. స్టోరీ నాకు ఏది నచ్చిదంటే... సింగిల్‌లైన్‌లో చెప్పలేను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్ సింపుల్ గర్ల్‌గా చేశాను. ఈసినిమలో నా పాత్ర ఎంతో మోడ్రరన్‌గా, హైపర్‌గా, అటిట్యూడ్‌తో ఉంటుంది. ప్రతి నటికి కావాలసిన వైవిధ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను. నేనీ పాత్ర కోసం ఎలాంటి వర్క్ పాప్, హోంవర్క్ చేయలేదు. నా రియల్‌లైఫ్‌కు ఎలాంటి కంపారిజిన్ లేని పాత్ర సత్యభామ పాత్ర. నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను.
టాలీవుడ్ ఎంట్రీ ఎలావుంది...
తెలుగులో అవకాశం రావడం హ్యపీగా అనిపించింది. తెలుగు టెక్నిషియన్స్, ఆర్టిస్ట్‌ల్లో ఎంతో ప్రొఫెజనలిజం వుంది. ఎంతో కంపర్టబుల్‌గా నటించాను. లాంగ్వేజ్ తప్ప నాకు తెలుగులో ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించలేదు. అన్ని లాంగ్వేజ్‌ల మాదిరిగా నాకు ఇక్కడ ఎక్కడ కంఫర్టబుల్‌గా అనిపించింది. ఈ సినిమాలో కోసం నాకు స్విమింగ్ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే స్విమింగ్ చేశాను. నాకు ఎంతో భయమేసిన సినిమా కోసం చేశాను. ఈ సినిమాలో హరీశ్ శంకర్, మారుతి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అలానే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశాను. ఇప్పుడు తెలుగు అర్థం అవుతోంది. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా సినిమాలు చూస్తుంటాను. ఇటీవల తెలుగు హిట్-3 సినిమా చూశాను.
సుహాస్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్...
వెరీ నైస్ పర్సన్. ఎంతో హార్డ్‌వర్క్ చేస్తాడు. సినిమా సెట్‌లో సినిమా కోసం మాత్రమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్ పర్సన్ కాదు. జనరల్‌గా అని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలే అయినా ఈ సినిమాలో లవ్ సీన్స్ లో ఫీల్ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్ అవుతారు. ఓవర్ ఆల్ గా ఈ సినిమా చేయడం, ఇలాంటి పాత్ర లభించడం, సత్యభామ పాత్ర చేయడం నేను ఎంతో లక్కీగా భావిస్తున్నాను.
ఎలాంటి పాత్రలు చేయడం ఇష్టమంటే...
నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా చాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటిన్ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం.
మీ ఫ్యామిలీ నేపథ్యం...
సినిమాలతో సంబంధం లేని ఫ్యామిలీ మాది. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తోనే నటిస్తున్నాను. కానీ మాబంధువులు మొదట్లో భయపడ్డారు. నాకు మాత్రం ఎలాంటి భయం లేదు. సినిమాల్లో నటించడం గర్వంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు. సినిమాల్లోకి వచ్చాక చాలా ఆఫర్లు వచ్చాయి. నాకు నచ్చిన కథలతో మాత్రమే చేస్తున్నాను. నా కంఫర్ట్ జోన్‌లో సినిమాలు చేస్తున్నాను. నేను ఆ రోల్ ఫిట్ అనుకుంటేనే చేస్తున్నాను. మలయాళ ఫిల్మ్ ఫస్ట్ చేశాను. 'జో' తమిళ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Also Read: Rashmika Mandanna: వాళ్ళు నన్ను దేనికి పిలవడం లేదు.. బాధగా ఉంది
Also Read: Jwala Gutta: ఆమిర్ లేకుండా ఇది జరిగేది కాదు.. ఎంతో ప్రత్యేకం..