Rashmika Mandanna: వాళ్ళు నన్ను దేనికి పిలవడం లేదు.. బాధగా ఉంది
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:46 PM
రష్మిక మందన్నా తన బిజీ షెడ్యూల్స్‌తో చాలా మిస్ అవుతున్నట్లు చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. వీకెండ్‌ను, చెల్లిని చాలా మిస్ అవుతున్నట్లు చెప్పారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస చిత్రాలతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. భాషలతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ఒకరిద్దరు మినహా దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన ఆమె నటించినట్లే. తన బిజీ షెడ్యూల్స్‌తో ఇంటిని, కుటుంబ సభ్యులను చాలా మిస్ అవుతున్నట్లు చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. వీకెండ్‌ను, చెల్లిని చాలా మిస్ అవుతున్నట్లు చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో మీ సెలవులను ఎలా ఎంజాయ్ చేస్తారు అనే ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చారు. ‘‘నా వారాంతపు సెలవు కోసం ఏడుస్తాను. నాకు చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 సంవత్సరాలు చిన్నది. ఇప్పుడు తనకు 13 ఏళ్లు. నా కెరీర్ ప్రారంబి?ంచినప్పటినుంచి సుమారు ఎనిమిదేళ్లుగా ఆమెను నేను సరిగ్గా చూసుకో లేక పోతున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ విషయంలో చాలా బాధగా ఉంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్లలేదు. స్నేహితలను చూడలేదు. ఇంతకుముందు వాళ్లు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తే నన్ను కూడా భాగం చేసుకునేవారు. నాకు సమయం ఉండడం లేదని ఇప్పుడు నాకు చెప్పడం కూడా మానేశారు’’ అని అన్నారు.
తరచూ మా అమ్మ ఒక విషయం చెబుతుంటుంది. వృత్తి జీవితంలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని.. వ్యక్తిగత జీవితం బాగుండాలని కోరుకుంటే కెరీర్‌లో కొన్నింటిని త్యాగం చేయాలని చెప్పింది. కానీ, నేను రెండింటి కోసం కష్టపడుతున్నాను’’ అని రష్మిక తెలిపారు. తన సొంత ఊరును కూడా మిస్ అవుతున్నట్లు నేషనల్ క్రష్ చెప్పారు. ఈ ఏడాది ఛావా సినిమాతో విజయం సాధించిన ఆమె తాజా ‘కుబేర’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆయుాష్మాన్ ఖురానాతో కలిసి ‘థామా’ అనే హారర్ కామెడీలో నటిస్తున్నారు. దీనితో పాటు తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు తనకు కొత్త జానర్‌లో ‘మెసా’ అనే చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు.