సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్

ABN, Publish Date - Aug 15 , 2025 | 07:23 PM

సీనియర్ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చని చిలుకలు తోడుంటే .. పాడే కోయిలా వెంటుంటే అంటూ భారతీయుడులో ఇద్దరు కమల్ హాసన్ లతో ఆడిపాడిన చిన్నది కస్తూరి.

Kasthuri

Kasthuri Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చని చిలుకలు తోడుంటే .. పాడే కోయిలా వెంటుంటే అంటూ భారతీయుడులో ఇద్దరు కమల్ హాసన్ లతో ఆడిపాడిన చిన్నది కస్తూరి. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కస్తూరి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది.


ఇక సీరియల్స్ తో రీఎంట్రీ ఇచ్చింది కస్తూరి. మా ఇంటి గృహాలక్ష్మీ సీరియల్ తో ఆమె బుల్లితెరకు చేరువయ్యింది. ఇక ఈ సీరియల్ తరువాత వరుస సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా మారింది. ఇక సినిమాలతో కన్నా వివాదాలతోనే బాగా ఫేమస్ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు.. సమాజంలో జరిగే సంఘటనల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక అలానే మొన్నామధ్య ఒక కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా అమ్మడిలో మార్పు రాలేదు. తన మనసుకు నచ్చని ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తుంది.


ఇక ఆ ధైర్యంతోనే కస్తూరి ఒక అడుగు ముందుకేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. నేడు కస్తూరి శంకర్ బీజేపీలో చేరింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో కస్తూరి బీజేపీ కండువా కప్పుకుంది. ఆమెతో పాటు ట్రాన్స్ జెండర్ కార్యకర్త నమితా మారిముత్తు కూడా బీజేపీలో చేరింది. వీరిద్దరిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారిద్దరిని బీజేపీ లోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని నైనార్ నాగేంద్రన్ తెలిపాడు. ఇప్పటివరకు పార్టీ సపోర్ట్ లేకుండానే తన గళం విప్పిన కస్తూరి.. ఇప్పుడు పార్టీ బలం తోడవ్వడంతో ఎలాంటి వివాదాలను రేకెత్తిస్తుందో చూడాలి.

Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా

Baahubali The Epic Teaser: బాహుబలి ది ఎపిక్ టీజర్ పై ఫ్యాన్స్ ఫైర్

Updated Date - Aug 15 , 2025 | 07:23 PM