Vishal Sai Dhanshika: విశాల్, సాయి ధన్సిక.. నిశ్చితార్థం అయిపోయింది
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:59 PM
మొత్తానికీ హీరో విశాల్, నటి సాయిధన్సిక వివాహ నిశ్చితార్థం అయిపోయింది. తన పుట్టిన రోజునే విశాల్ వెడ్డింగ్ ఎంగేజ్ మెంట్ జరుపుకోవడం విశేషం.
ప్రముఖ కథానాయకుడు విశాల్ (Vishal) మొత్తానికి ఓ ఇంటి వాడు అయిపోతున్నాడు. ఆ మధ్య నటి సాయి ధన్సిక (Sai Dhanshika) తో తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే తాము పెళ్ళి చేసుకుంటామని విశాల్ ప్రకటించాడు.
నిజానికి ఆగస్ట్ లో వీరి పెళ్ళి జరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే... విశాల్ మాట ఇచ్చినట్టుగా 'నడిగర్ సంఘం'లో వివాహ వేదిక నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ పెళ్ళి వాయిదా పడింది. దాంతో తన పుట్టిన రోజునే కుటుంబ సభ్యుల సమక్షంలో సాయి ధన్సికతో తన ఎంగేజ్ మెంట్ జరిగిందని విశాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలనూ విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు, సినిమా రంగానికి చెందిన వారు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ప్రస్తుతం విశాల్ 'మకుటం' మూవీలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన పోస్టర్ విడుదలై సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
Also Read: Chiranjeevi: సైకిల్‌పై మెగాస్టార్ దగ్గకు మహిళా అభిమాని.. చలించిన చిరు...
Also Read: Murugadoss: కొత్త వివాదానికి తెర తీసిన 'మదరాసి'