Chiranjeevi: సైకిల్‌పై మెగాస్టార్ దగ్గకు మహిళా అభిమాని.. చలించిన చిరు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:50 PM
అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన అభిమానులను అభిమానులుగానే కాక, కుటుంబ సభ్యుల్లా భావిస్తారు చిరు.
అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చూపించే ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన అభిమానులను అభిమానులుగానే కాక, కుటుంబ సభ్యుల్లా భావిస్తారు చిరు. వారిని అక్కున చేర్చుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. మహోన్నతమైన వ్యక్తిత్వం, సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి (Mega Fan Rajeswari) చిరుని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు (Adoni to Hydrabad) ప్రయాణం మొదలు పెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానం, ప్రేమ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చిరు చలించిపోయారు. ఆమెను సహృదయంతో ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంలో రాజేశ్వరి, చిరుకి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి చీరను బహుమతిగా ఇచ్చారు. అంతే కాదు రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్తులో వెలుగు నింపడం కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు చిరంజీవి. (Megs Fan cycle Ride)
ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడితో ‘మన శంకర్‌వర ప్రసాద్‌గారు’ చిత్రాలు చేస్తున్నారు. విశ్వంభర వచ్చే ఏడాది సమ్మర్‌లో, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి రాబోతున్నాయి. ఇవి కాకుండా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయబోతున్నారు.