Aarsha Chandini Baiju: సూర్యపై క్రష్ ‘హౌస్‌మేట్స్’ హీరోయిన్
ABN, Publish Date - Aug 12 , 2025 | 07:12 PM
హీరో సూర్యపై తనకు ప్రత్యేకమైన క్రష్ ఉందని ‘హౌస్‌మేట్స్’ హీరోయిన్ అర్ష బైజు అంటున్నారు.
హీరో సూర్యపై (Suriya) తనకు ప్రత్యేకమైన క్రష్ ఉందని ‘హౌస్‌మేట్స్’ (Housemates) హీరోయిన్ అర్ష బైజు (Arsha Baiju)అంటున్నారు. ఈ మలయాళ యువనటి చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టగా, పైగా హౌస్‌మేట్స్‌లో ఆమె నటనను సినీ విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తొలి తమిళ సినీ అనుభవం గురించి మాట్లాడుతూ, ‘మలయాళంలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా నటించాలని ఆశపడ్డాను. అది ‘హౌస్‌మేట్స్’తో నెరవేరింది. తమిళ ప్రజలు ప్రతిభకు విలువనిస్తారు. ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో థియేటర్లలో ప్రత్యక్షంగా చూశాను. ఇది నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
మలయాళ, తమిళ సినిమాకు పెద్ద తేడా లేదు. తమిళ సినిమా పెద్ద పరిశ్రమ. ఇక్కడ భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తారు. హీరోయిన్ల ప్రతిభను గుర్తిస్తారు. నయనతార వంటి స్టార్ హీరోయిన్‌తో సహా అనేక మలయాళ హీరోయిన్లు ఇక్కడ రాణిస్తున్నారు. పైగా తమిళంలో హీరోయిన్ కావాలన్న చిరకాల కోరి నెరవేరింది. మంచి సినిమాల్లో, మంచి పాత్రల్లో నటించాలన్నదే నా కోరిక. అలాగే, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధాన హీరోయిన్లలో ఒకరిగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
ALSO READ: Anirudh : కూలీపై అనిరుధ్ రివ్యూ
Monica Bellucci: మోనికా సాంగ్ చూసి మోనికా బెలూచి ఏమన్నదంటే..
Kantara: Chapter 1: కాంతారా ఛాప్టర్ 1.. ప్రమాదాలు.. నిర్మాత క్లారిటీ
Pooja Hegde : పెయిడ్ ట్రోలింగ్‌పై పూజా షాకింగ్ కామెంట్స్