సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jana Nayagan: తెలుగులో జన నాయకుడు గా...

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:06 PM

విజయ్ తో జన నాయగన్ మూవీని నిర్మిస్తున్న లోహిత్ తెలుగులోనూ త్వరలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అతి త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలుపనున్నారు.

దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan). వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఇది విడుదల కాబోతోంది. పూజా హెగ్డే (Pooja Hegde) నాయికగా నటించిన ఈ సినిమాను హెచ్. వినోద్ (H. Vinoth) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్. కె. లోహిత్ (N.K. Lohith) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో 'జన నాయకుడు' పేరుతో డబ్ చేస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం తిరుమలలో స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం ఎన్. కె. లోహిత్ అక్కడ మీడియాలో మాట్లాడారు. విజయ్ తో తాను నిర్మిస్తున్న 'జన నాయగన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నానని, అతి త్వరలోనే తెలుగులోనూ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నానని ఆయన అన్నారు.


'జన నాయగన్' సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా సెట్స్ కు వెళ్ళడానికి ముందే విజయ్ సొంత రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. అయితే ముందుగా కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయన దీనిని చివరి చిత్రంగా చేయడానికి ముందుకొచ్చారు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ రోర్ వీడియోకు మంచి స్పందన లభించింది. అనిరుధ్‌ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Also Read: War 2: ఫస్ట్ డే కలెక్షన్స్ పై గురి...

Also Read: SS Rajamouli: పదేళ్ళ బాహుబలి...

Updated Date - Jul 09 , 2025 | 06:08 PM