Nayanam: వరుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ 'నయనం'
ABN, Publish Date - Dec 01 , 2025 | 06:26 PM
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'నయనం' వెబ్ సీరిస్ జీ 5లో డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు.
వరుణ్ సందేశ్ (Varun Sandesh) సైతం వెబ్ సీరిస్ చేసిన హీరోల జాబితాలో చేరిపోయాడు. అతను నటించిన ఫస్ట్ ఓటీటీ తెలుగు వెబ్ సీరిస్ 'నయనం' (Nayanam). డిసెంబర్ 19 నుండి ఇది జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ వెబ్ సీరిస్ ను స్వాతి ప్రకాశ్ (Swathi Prakash) డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్త్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించబోతున్నారు.
'నయనం' వెబ్ సీరిస్ ఫస్ట్ లుక్ ను జీ 5 తాజాగా విడుదల చేసింది. ఈ ఒరిజినల్ లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. దీని గురించి వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, 'నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకూ చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్ గా కనిపించబోతున్నాను. పోస్టర్ ను గమనిస్తే నా పాత్రలోని ఇంటెన్సిటీ అర్థమౌతుంది. ఇందులో డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టత కనిపిస్తాయి. వెబ్ సీరిస్ లో యాక్ట్ చేయడం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ ను మరింతగా ఎలివేట్ చేసినట్టు అయ్యింది. వీక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని అన్నారు.
Also Read: Kandula Durgesh: ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్’లో కందుల దుర్గేశ్ ఏమన్నారంటే..
Also Read: Peddhi: నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్ల డీల్