Mandala Murders: స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది...

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:12 AM

యశ్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ 'మండల మర్డర్స్'. ఇది జులై 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

'ది రైల్వే మ్యాన్' (The Railway Man) వెబ్ సీరిస్ కు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films), నైట్ ఫ్లిక్స్ (Netfilx) భాగస్వామ్యంలో మరో వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. అదే 'మండల మర్డర్స్' (Mandala Murders). వాణీ కపూర్ (Vani Kapoor), సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను గోపీపుత్రన్, మనన్ రావత్ డైరెక్ట్ చేశారు. వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితులే. వాణీ కపూర్ హీరో నాని (Nani) సరసన 'ఆహా కళ్యాణం'లో నటించగా, సుర్వీన్ చావ్లా తన కెరీర్ ప్రారంభంలో 'రాజు మహరాజు' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఈ డార్క్ మిస్టరీ థ్రిల్లరీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. జులై 25 నుండి ఈ వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.


'మండల మర్డర్స్' వెబ్ సీరిస్ లో చరణ్‌ దాస్ పూర్ పట్టణంలో ఆచారాల పేరుతో జరిగే హత్యలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చీకటి కోణాలకు సంబంధించిన సంఘటనలు ఉండబోతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పట్టణం హత్యలతో అట్టుడికిపోతుంది. ఈ రహస్యాన్ని ఛేదించే డిటెక్టివ్ రియా పాత్రను గ్లామర్ క్వీన్ వాణీ కపూర్ పోషించింది. ఇతర కీలక పాత్రలను వైభవ్ రాజ్ గుప్తా, సామ్మి జోనస్ హెనీ, జమీల్ ఖాన్, శ్రియా పిల్గాన్కర్ పోషించారు.

Also Read: Actor Sivaji Spl Chitchat: ఫైర్ బ్రాండ్ నటుడు శివాజీతో స్పెషల్ ఇంటర్వూ

Also Read: Rana Daggubati: తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్.. రానా సపోర్ట్

Updated Date - Jul 01 , 2025 | 10:12 AM