సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Single OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన శ్రీవిష్ణు సింగిల్‌! ఎందులో అంటే

ABN, Publish Date - Jun 06 , 2025 | 07:33 AM

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం సింగిల్ ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

single

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం సింగిల్ (#Single). శ్రీవిష్ణు (Sree Vishnu), వెన్నెల కిశోర్ (Vennela Kishore), ఇవానా (Ivana), కేతిక శ‌ర్మ (Ketika Sharma) జంట‌గా న‌టించిన ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, బ‌న్నీ వాస్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరించ‌గా గ‌తంలో సందీప్ కిష‌న్‌తో నిను వీడ‌ను నీడ‌ను నేనే సినిమాను రూపొందించిన‌ కార్తీక్ రాజు (Caarthick Raju) ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా న‌డుస్తుండ‌గానే ఉన్న‌ఫ‌లంగా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చి షాకిచ్చారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ బ్యాంకులో ప‌ని చేసే విజ‌య్ కార్ల‌ షోరూంలో ప‌ని చేసే పూర్వ‌ను ఓ రోజు మెట్రోలో చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆదే స‌మ‌యంలో హ‌రిణి అనే యువ‌తి విజ‌య్‌కు తెలియ‌కుండా అత‌న్ని ప్రేమిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ ఇద్ద‌రిలో ఎవ‌రి ప్రేమ‌ను సొంతం చేసుకున్నాడు, అస‌లు పెళ్లి చేసుకున్నాడా లేదా అనే సింపుల్ పాయింట్‌తో సినిమా సాగుతూ ఆద్యంతం వ‌న్ లైన‌ర్ పంచుల‌తో కుడుపుబ్బా న‌వ్విస్తారు. సినిమా చివ‌ర‌లో హీరోయిన్లు మాన‌సా చౌద‌రి, రెబా మౌనిక జాన్‌, హీరో నార్నే నితిన్‌, క‌మెడియ‌న్ స‌త్య అతిధి పాత్ర‌ల్లో ఎంట్రీ ఇచ్చి స‌ర్‌ఫ్రైజ్ చేయ‌డం విశేషం.

ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ ప‌ర‌మ రోటీన్‌, తెలిసిందే అయినా ట్రీట్‌మెంట్, స్క్రీన్ ప్లే మాత్రం ఎక్క‌డా బోర్ కొట్ట‌నీయ‌కుండా ఉంటుంది. ప్ర‌తి నిమిషానికో పంచ్‌ అనే లెవ‌ల్లో మూవీలో డైలాగ్స్ ఉంటూ హ‌స్యం పంచుతాయి. వెన్నెల కిశోర్ ఈ మూవీలో సెకండ్ హీరో అనేలా ఆయ‌న పాత్ర చివ‌రి వ‌ర‌కు ఉంటుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. మంచి కామెడీ, స‌ర‌దా, స‌ర‌దాగా సాగిపోయే సినిమా చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సింగిల్ (#Single) సినిమాను మిస్ చేసుకోవ‌ద్దు. ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు లేవు కుటుంబం అంతా క‌లిసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. సాటిస్ పై అవుతారు.


ఇవి కూడా చ‌ద‌వండి..

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌.. అదిరిపోయే హిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

స‌డ‌న్‌గా ఓటీటీకి.. స్పైన్ చిల్లింగ్ స‌ర్వైవ‌ల్ హ‌ర్ర‌ర్‌థ్రిల్ల‌ర్‌! ఎందులో చూడాలంటే

ఆరేండ్ల త‌ర్వాత తెలుగులో.. ఓటీటీకి వ‌చ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ కామెడీ థ్రిల్ల‌ర్

రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీకి.. స‌ప్త‌గిరి పెళ్లి కాని ప్ర‌సాద్! ఎందులో అంటే

స‌డ‌న్‌గా ఓటీటీకి.. హాలీవుడ్ లేటెస్ట్ బోల్డ్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌! ఎందులో చూడాలంటే

Updated Date - Jun 06 , 2025 | 08:54 AM