Pelli Kaani Prasad OTT: రెండు నెలల తర్వాత ఓటీటీకి.. సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్! ఎందులో అంటే
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:29 AM
సప్తగిరి హీరోగా మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు రీచ్ కాలేక పోయిన తెలుగు చిత్రం పెళ్లి కాని ప్రసాద్.
మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు రీచ్ కాలేక పోయిన తెలుగు చిత్రం పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kaani Prasad). మల్లీశ్వరి సినిమాలోని విక్టరీ వెంకటేశ్ పేరుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టుకుని రిలీజ్‌కు ముందే మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో కమెడియన్ సప్తగిరి (Sapthagiri) హీరోగా నటించగా ప్రియాంక శర్మ (Priyanka Sharma) కథానాయికగా చేసింది. మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని సాయి శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. అభిలాష్ రెడ్డి గోపిడి. (Abhilash Reddy) దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన 70 రోజుల తర్వాత ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తోంది.
కథ విషయానికి వస్తే.. 36 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కావట్లేదని టెన్షన్లో ఉంటుంటాడు ప్రసాద్. ప్రస్తుత అతని మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు కోట్ల కట్నం ఇచ్చే సంబంధమే చేస్తానని భీష్మించుకుని ఉంటాడు ప్రసాద్ తండ్రి. చివరకు పట్టలేక తను పైసా కట్నం తీసుకోకుండా ప్రేమించిన అమ్మాయిని పెల్లి చేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫారిన్ లో ఉంటాడన్న కారణంతో ప్రసాద్‌ను పెళ్ళాడిన ప్రియ, ఆమె కుటుంబ సభ్యులు అతనితో ఎలా చెడుగుడు ఆడారనేదే ఈ సినిమా.
ఫ్యామిలీతో సహా ఫారిన్లో స్థిర పడాలనే అమ్మాయు కుటంబం అందుకు తగ్గట్టుగా మలేసియాలో ఉంటున్న అబ్బాయిని ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుంటుంది. అయితే విదేశాల్లో ఉండడం ఇష్టం లేని హీరో అక్కడ అన్ని వదిలేసి ఇండియాలో స్థిర పడతాడు. దీంతో అప్పటి వరకు ఎన్నో కలలతో ఉన్న అమ్మాయి కుటుంబం ఏం చేసిందనే కథతో ఈ సినిమా సాగుతుంది. అక్కడక్కడ లాగ్, రొటీన్ సన్నివేశాలు వచ్చి కాస్త బోర్ కొడతాయి. ఇప్పుడీ సినిమా జూన్ 5(గురువారం) నుంచి ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. సప్తగిరి కామెడీ నచ్చే వాళ్లు ఈ పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kaani Prasad) సినిమాను వీక్షించొచ్చు.