The Game: శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో వెబ్ సీరిస్
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:32 PM
శ్రధ్ధా శ్రీనాథ్ నటించిన వెబ్ సీరిస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్'. రాజేశ్ ఎం సెల్వా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ అక్టోబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటించిన వెబ్ సీరిస్ 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్'. నెట్ ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సీరిస్ అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. 'బ్లాక్ వారంట్' తర్వాత నెట్ ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను రాజేశ్ ఎం. సెల్వా డైరెక్ట్ చేశాడు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, బాల హాసన్, సుభాష్ సెల్వం వివియా సంతోష్, ధీరజ్, హేమా తదితరులు పోషించారు. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ తో పాటు టైమ్లీ థీమ్స్ ను మిక్స్ చేస్తూ ఈ వెబ్ సీరిస్ ను రాజేశ్ రూపొందించాడని నిర్మాణ సంస్థలు తెలిపారు.
ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, 'ది గేమ్ ఈ యేడాది మా ఫస్ట్ తమిళ సీరిస్. ఇందుకోసం మంచి స్టోరీని ఎంపిక చేసుకున్నాం. ఒక ఫీమేల్ గేమ్ డెవలపర్ కథ ఇది. తనపై జరిగే కో-ఆర్డినేటెడ్ అటాక్ వెనుక ఉన్న వారిని ట్రాక్ చేసే థ్రిల్లర్ వెబ్ సీరిస్ ఇది' అని అన్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ సమీర్ నాయర్ మాట్లాడుతూ, 'ది గేమ్ అనేది డిజిటల్ యుగం రియాలిటీలను చూపించే స్టోరీ. రాజేష్ సెల్వ స్టైల్‌తో స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్ తో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది' అని చెప్పారు. దర్శకుడు రాజేశ్ మాట్లాడుతూ, 'ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... మనం ఉన్న రియల్ వరల్డ్‌కి అద్దం పడుతుంది. ప్రజలు, వాళ్ళ కోరికలు, బలం, బలహీనత, నిజం, అబద్దం మధ్య ఉండే చిన్న తేడాలు వీటికి సంబంధించిన కథ' అని అన్నారు.
Also Read: Movie Ticket Rates GST: తగ్గనున్న.. సినిమా టికెట్ ధరలు.. కింది క్లాసులకు భారీ ఊరట
Also Read: Young Tiger: వెట్రిమారన్ వైపు యన్టీఆర్ చూపు