Detective Ujjwalan OTT: ఓటీటీకి తెలుగులోనూ వస్తోన్న.. రీసెంట్ మలయాళ, మిస్టరీ కామెడీ థ్రిల్లర్
ABN, Publish Date - Sep 01 , 2025 | 08:37 PM
మూడు నెలల క్రితం మలయాళం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన మిస్టరీ, కామెడీ థ్రిల్లర్ చిత్రం డిటెక్టివ్ ఉజ్వలన్
మూడు నెలల క్రితం మలయాళం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన మిస్టరీ, కామెడీ థ్రిల్లర్ చిత్రం డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan). ఇంద్రనీల్ గోపాల కృష్ణన్ (Indraneel Gopalakrishnan), రాహుల్ (Rahul G) ద్వయం రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ద్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan), సిజు విల్సన్, రోని డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మేలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం ఆపై నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో కేవలం మలయాళంలో అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇతర భాషల సినీ ప్రేమికులు తీవ్ర నిరాశ చెందారు.
కాగా ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే అది మరో ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రానుండడం విశేషం. కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో 1960 సంవత్సరం తర్వాత నుంచి ఎలాంటి హత్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఆ రాష్ట్రంలో మంచి గుర్తింపును దక్కించుకుంటుంది. అలాంటిది అ ఊర్లో సడన్‌గా ఒకదాని తర్వాత మరోటి సీరియల్ మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఎవరో అగంతకుడు సుత్తెతో మనుషులను చంపుతుంటాడు.
అదే సమయంలో లైబ్రేరియన్ అయిన ఉజ్వలన్ ఆ ఉర్లో జరిగే మేకల, బంగారు గొలుసుల వంటి చిన్న చిన్న దొంగతనాలను ఇన్వెస్టిగేట్ చేసి పట్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే.. పోలీసుల సాయంతో వరుస హత్యల కేసుపై దృష్టి పెట్టిన ఉజ్వలన్ క్లూ లను సాధించే క్రమంలో హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయడం, చివరకు చేతి దాక వచ్చే సరికి అది మిస్ఫైర్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ముగ్గురు, నలుగురి విషయంలో జరుగుతుంది. చివరకు ఏస్సై, సీఐ కూడా హంతకులని అనుమానిస్తాడు.
ఈ నేపథ్యంలో ఉజ్వలన్ అసలు హంతకులను పట్టుకో గలిగాడా లేదా, ఆ హత్యలు చేయడం వెనక కారణమేంటి అనే ఇంట్రెస్టింగ్ కథనంతో సినిమా సాగుతుంది. ఎక్కడా ఎలింటి అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా సాగే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు. ఇప్పుడు ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే ( Lionsgate Play) ఓటీటీ (OTT) లో తెలుగులో పాటు మలయాళ భాషల్లోనూ సెప్టెంబర్ 12 నుంచి అందుబాటులోకి రానుంది. కాస్త కామెడీ, మిస్టరీ జానర్ చిత్రాలంటే ఇష్ట ముండే వారికి ఈ డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan). మూవీ బెస్ట్ ఆఫ్సన్.