సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeeva OTT: మరో సారి.. ఓటీటీ బాట పట్టిన రాజ్ తరుణ్‌

ABN, Publish Date - Oct 27 , 2025 | 06:17 PM

గతంలో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే అది కరోనా టైమ్. కానీ ఇప్పుడు అతని తాజా చిత్రం 'చిరంజీవ' సైతం ఓటీటీ బాట పట్టింది.

Raj Tarun Chiranjeeva Movie

యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌ (Raj Tarun) ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. నిజానికి అతను నటించి 'అహ నా పెళ్లంట' (Aha Naa Pellanta) అనే వెబ్ సీరిస్ మూడేళ్ళ క్రితం జీ 5లో స్ట్రీమింగ్ అయ్యింది. దానికి ముందు కరోనా కారణంగా రాజ్ తరుణ్‌ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' (Orey Bujjiga) ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తర్వాత సంవత్సరం రాజ్ తరుణ్‌ నటించిన మరో సినిమా 'పవర్ ప్లే' (Power Play) అమెజాన్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆరు సినిమాలు థియేటర్లలోనే సందడి చేశాయి. ఇందులో నాగార్జునతో కలిసి చేసిన 'నా సామిరంగ' (Naa Saami Ranga) కూడా ఉంది. గత యేడాది ఆ సినిమాతో పాటు రాజ్ తరుణ్ సోలో హీరోగా నటించిన మరో మూడు సినిమా 'పురుషోత్తముడు, తిరగబడరా సామి, భలే ఉన్నాడే' చిత్రాలు విడుదలయ్యాయి కానీ ఏవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో అతని తాజా చిత్రం 'చిరంజీవ' ఇప్పుడు ఓటీటీకే పరిమితమైపోంది. కుషిత కల్లపు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దీన్ని డైరెక్ట్ చేశాడు.


నవంబర్ 7వ తేదీ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ 'చిరంజీవ' (Chiranjeeva) స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శివ(రాజ్ తరుణ్) పుట్టగానే మహార్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. శివకు చిన్నప్పటి నుంచి స్పీడు ఎక్కువ. ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు అనేది శివకు తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలోనే శివ రౌడీ సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ తో చేసిన పోరాటంలో శివ గెలిచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. హీరో హీరోయిన్స్ కుషిత కల్లపు, రాజ్ తరుణ్ పాత్రల మధ్య వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. మరి 'చిరంజీవ'కు వీక్షకుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Also Read: Sachin: యువ నటుడు సచిన్ ఆత్మహత్య.. కారణం ఏంటంటే

Also Read: NBK 111: మహారాజుగా బాలకృష్ణ.. మహారాణిగా నయనతార

Updated Date - Oct 27 , 2025 | 07:25 PM