Sachin: యువ నటుడు సచిన్ ఆత్మహత్య.. కారణం ఏంటంటే

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:45 PM

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మరాఠి యువ కథానాయకుడు  సచిన్‌ చాంద్‌వడే (Sachin Chandwade -25) ఆత్మహత్య చేసుకున్నారు.

Sachin

బాలీవుడ్‌ (bollywood) ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మరాఠి యువ కథానాయకుడు  సచిన్‌ చాంద్‌వడే (Sachin Chandwade -25) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అయింది.  అయితే  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, ఉందిర్‌ఖేడ్‌లో  తన ఇంట్లో  ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డాడు సచిన్. అది  గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. తర్వాతి రోజు మరో  ఆస్పత్రికి తరలించారు. అయినా  ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందినట్టు తెలిసింది.

అయితే సచిన్  సూసైడ్‌కు కారణం  ఏంటనేది  తెలియాల్సి ఉంది.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన సచిన్‌.. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ‘జాంతాఢా 2’ (Jamtara 2) వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.   సచిన్ ఆత్మహత్యకు పాల్పడటానికి రెండు రోజుల ముందు.. తన తాజా చిత్రం 'అసురవన్' పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్నేహితులంతా చిన్నప్పటి నుంచి  తన  యాక్టివిటీస్, నటన పట్ల ఉన్న ప్రేమ గురించి చెబుతూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

Updated Date - Oct 27 , 2025 | 05:45 PM