Constable Kanakam OTT: కానిస్టేబుల్ కనకం..సీజన్ 2 వ‌చ్చేస్తోంది! బ‌హుమ‌తిగా.. ఐఫోన్ 17

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:13 AM

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన కానిస్టేబుల్ కనకం వెబ్ సీరిస్ సీజన్ 1 ను మూడు రోజుల పాటు ఉచితంగా వీక్షించే అవకాశాన్ని సంస్థ కలిగిస్తోంది. నవంబర్ 7 నుండి సీజన్ 2 మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సంస్థ తీసుకుంది.

Constable Kanakam

దాదాపు ఒకే తరహా కథాంశంతో 'విరాట పాలెం (Viratapalem), కానిస్టేబుల్ కనకం (Constable Kanakam)' వెబ్ సీరిసెస్ తెరకెక్కాయి. మొదటిది జీ 5 (Z5)లో ప్రసారం కాగా, అది స్ట్రీమింగ్ అయిన కొద్ది వారాలకే ఈటీవీ విన్ (ETV Win) లో 'కానిస్టేబుల్ కనకం' ప్రసారం అయ్యింది. 'విరాట పాలెం' వెబ్ సీరిస్ లో కానిస్టేబుల్ గా అభిజ్ఞా నటించగా, దీన్ని పోలూరు కృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక 'కానిస్టేబుల్ కనకం'లో టైటిల్ రోల్ ను ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) చేసింది. మాది ఒరిజినల్ అంటే మాది ఒరిజినల్ అంటూ రెండు ఓటీటీ సంస్థలు మీడియాకు ఎక్కాయి.


ck (3).jpeg

అయితే... ఇప్పుడు ఈటీవీ విన్ 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2ను స్ట్రీమింగ్ చేయడానికి సిద్థమైంది. నవంబర్ 7 నుంచి ఈ సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. దాంతో సీజన్ 1ను ఉచితంగా చూసే అవకాశాన్ని ఈటీవీ విన్ కలిగిస్తోంది. అక్టోబర్ 24, 25, 26 తేదీలలో పూర్తి ఉచితంగా ఈటీవీ విన్ యాప్ లో దీనిని చూడొచ్చని సంస్థ తెలియచేసింది.

అంతేకాదు... చంద్రిక ఎక్కడ ఉందనే విషయాన్ని గెస్ చేసి చెప్పిన వారికి సంస్థ ఐఫోన్ 17 ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తోంది. మరి ఈటీవీ విన్ కల్పించిన ఈ అవకాశం సీజన్ 2 వ్యూవర్ షిప్ ను ఏ మేరకు పెంచుతుందో చూడాలి.

Also Read: Rajanikanth: మీ కృషి, వ్యక్తిత్వం అద్భుతం

Also Read: OG OTT: ఓజెస్ గంభీర.. ఓటీటీకి వ‌చ్చేశాడు! ఇక ర‌చ్చ ర‌చ్చే

Updated Date - Oct 23 , 2025 | 06:45 PM

Constable Kanakam Trailer: వేటాడితే బెదరడానికి అది జింక కాదు.. ఉత్కంఠ రేపుతున్న కానిస్టేబుల్ కనకం ట్రైలర్

Constable Kanakam: అమ్మాయి గౌరవం పెంచేలా..

Constable Kanakam: ఈ సమయంలో ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టమే 

VIRAATAPALEM: విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్

Viraata Palem: ముదురుతున్న కాపీ రైట్ వివాదం