Constable Kanakam: అమ్మాయి గౌరవం పెంచేలా..
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:14 AM
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఈనెల 14 నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘అమ్మాయిలపై గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది’ అని అన్నారు.