Annamayya Movie: అప్పుడూ ఇప్పుడూ ఆయనే సీఎం...

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:43 PM

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రం 29 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రారంభమైంది. అప్పుడు సీఎం హోదాలో క్లాప్ కొట్టిన నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కూడా ఏపీ సీ.ఎం.గా ఉండటం విశేషం.

Annamayya Movie Opening

'అన్నమయ్య'... నటుడిగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) కు భగవంతుడి పాత్రల కంటే భక్తుడి పాత్రలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. అలా అక్కినేని నాగార్జున సైతం తండ్రిబాటలోకి అడుగుపెట్టిన సినిమా 'అన్నమయ్య' (Annamayya). దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) సైతం అప్పటి వరకూ తనకున్న ఇమేజ్ ను బ్రేక్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది. చిత్తూరుకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత వి. దొరస్వామిరాజు (V Doraswamy Raju) ఈ సినిమాను నిర్మించారు. 1996 సెప్టెంబర్ 19న ఈ సినిమా షూటింగ్ అంటే 29 సంవత్సరాల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. అప్పుడు క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశేషం ఏమంటే... 29 యేళ్ళ తర్వాత ఇప్పుడూ ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు.


'అన్నమయ్య' చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ (Suman) నటించారు. ఆయన భార్యలుగా భానుప్రియ (Bhanupriya), సుకన్య (Sukanya) నటించారు. కీరవాణి (Keeravani) స్వరపర్చిన 'కలగంటి... కలగంటి' పాటతో రాఘవేంద్రరావు షూటింగ్ ప్రారంభించారు. భాస్కరరాజు ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తిరుమల ఆనందనిలయాన్ని ఆయన అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. పద కవితా పితామహుయుడు అన్నమయ్య కీర్తనలకు కీరవాణి అద్భుతంగా బాణీలు కట్టారు. ఇప్పటికీ 'అన్నమయ్య' చిత్రంలోని పాటలు భక్తులను పరవసింప చేస్తాయి. నాగార్జున సరసన రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. మోహన్ బాబు, రోజా కీలక పాత్రలు పోషించారు. ఎ. విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఆ యేడాది నంది అవార్డుల పంటను పండించింది. పలు కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకున్నా... దర్శక నిర్మాతలు ఎందుకనే శతదినోత్సవ వేడుకను మాత్రం నిర్వహించలేదు. ఆ తర్వాత నాగార్జున పలు చిత్రాలలో భక్తుడి పాత్రలు పోషించారు, కె. రాఘవేంద్రరావు భక్తిరస ప్రధాన చిత్రాలను రూపొందించారు.

annamayya f.jpg

Also Read: Sukumar Writings: సుకుమార్ రైటింగ్స్‌కు.. ప‌దేళ్లు! లైన్‌లో.. ఆరు కొత్త చిత్రాలు

Also Read: Nazriya Nazim: టొవినో థామస్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్

Updated Date - Sep 19 , 2025 | 12:49 PM