సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telugu Film Chamber: బై లా ప్రకారమే అంతా...

ABN, Publish Date - Jul 07 , 2025 | 03:57 PM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రస్తుత కమిటీ మరో యేడాది పాటు కొనసాగబోతోంది. దీనిపై వచ్చిన విమర్శలకు సెక్రటరీ దాము కౌంటర్ ఇచ్చారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) కు ఈ జులై మాసంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే... ఇవాళ సినిమా రంగాన్ని వివిధ సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో అనుభవజ్ఞులైన పాత కమిటీనే మరోసారి కొనసాగలంటూ ఈసీ మెంబర్స్ తీర్మానం చేశారు. దాంతో భరత్ భూషణ్ (Bharath Bhushan) అధ్యక్షుడిగా, కె.ఎల్. దామోదర ప్రసాద్ (K.L. Damodara Prasad) కార్యదర్శిగా, తుమ్మల ప్రస్ననకుమార్ (Prasanna Kumar) ట్రెజరర్ గా ఉన్న ఈ కార్యవర్గమే ఇక మీదట కూడా కొనసాగబోతోంది.


అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం వ్యవహారశైలిని కొందరు తప్పుపడుతున్నారు. ఎన్నికలు జరపకుండా, మెజారిటీ కార్యవర్గ సభ్యుల ఆమోదాన్ని సాకుగా చూపి పాత కార్యవర్గం కొనసాగడాన్ని నిరసిస్తున్నారు. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి, ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, రవీంద్ గోపాల తదితరులు విమర్శించారు. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఛాంబర్ ఎన్నికలను ఉద్దేశ్యపూర్వంగా కొందరు వాయిదా పడేలా చేస్తున్నారని బసిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగాలంటే ఈ నెలాఖరులో ఎన్నికలు జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత కమిటీ సినీ కార్మికుల ఆశలను నెరవేర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు.

ఇదే సమయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ దీనిపై స్పందించారు. ఫిలిం ఛాంబర్ లో కొన్ని కీలక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, అలానే తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయని అన్నారు. అందుకే ఈసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ కమిటీని మరో యేడాది వరకూ కొనసాగించబోతున్నామని తెలిపారు. ఈసీ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ రావాల్సిందని, అప్పుడు రాకుండా ఇప్పుడు మీడియా ముందు వెళ్ళి మాట్లాడితే ఎలా? అని ఆయన కౌంటర్ అటాచ్ చేశారు. అన్ని నిర్ణయాలను 'బై లా' ప్రకారమే తీసుకున్నామని స్పష్టం చేశారు.

Also Read: Tollywood: సాయికిరణ్ అడివికి కోపమొచ్చింది...

Also Read: Kuberaa Vs Squid Game: ఇదేంటి.. కుబేర, స్క్విడ్‌ గేమ్ ఒకేలా ఉన్నాయి

Updated Date - Jul 07 , 2025 | 03:57 PM