సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Connplex Cinemas OG: హైదరాబాద్‌లో.. మ‌రో కొత్త మ‌ల్టీఫ్లెక్స్! తెలంగాణలో.. ఫ‌స్ట్ టైం

ABN, Publish Date - Sep 24 , 2025 | 07:05 PM

పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో కాన్ ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్స్ ప్రారంభోత్సవం జరిగింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఇందులో స్క్రీనింగ్స్ ను ప్రారంభించబోతున్నారు.

Connplex Cinemas Opening

హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో(MPM Time square mall) లగ్జరీ మల్టీప్లెక్స్‌ బుధవారం ప్రారంభమైంది. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ (Connplex Cinemas) లగ్జరియన్ థియేటర్‌ ప్రారంభోత్సవంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, 'కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలికి నా అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హీరో సిద్దు, నిర్మాతలు చినబాబు, నాగవంశీ రావడం ఆనందంగా ఉందన్నారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, 'కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్. థియేటర్ చాలా బాగుంది. స్క్రీన్ చాలా నచ్చిందన్నారు.


విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ, 'కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను ఈరోజు ప్రారంభించాం. ఇదొక గుజరాత్ బ్రాండ్. దేశ వ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే మొదటి థియేటర్. యూఎస్‌లో మాస్టర్స్ చేసిన మేం ముగ్గురం కలిసి ఇక్కడ ఈ థియేటర్‌ను ప్రారంభించాం. ఆడియెన్స్‌కి లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాలని ఈ థియేటర్‌ను ప్రారంభించాం. మూడు స్క్రీన్లలో కలిపి 171 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మరి కొన్ని నెలల్లో రెండు స్క్రీన్లను యాడ్ చేస్తాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాల్లో స్క్రీన్లను ప్రారంభించాలని అనుకుంటున్నాను. అన్ని చిత్రాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోని ఇక్కడ లాంఛ్ చేస్తాం. ‘ఓజీ’ మూవీతో మా స్క్రీన్లను ప్రారంభించబోతున్నాం. అందరూ వచ్చి మా థియేటర్‌ను సందర్శించండి’ అని అన్నారు.

Also Read: Nagarjuna: సెంచరీ దిశగా నాగార్జున

Also Read: Sandeep Vanga: యూత్ టాలెంట్ తో వంగా సరికొత్త సినిమా

Updated Date - Sep 24 , 2025 | 08:05 PM