Nagarjuna: సెంచరీ.. దిశగా నాగార్జున
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:47 PM
కింగ్ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్ కు చేరువయ్యాడు. సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాడు. మరి అంతటి మార్క్ కు ప్రత్యేకత ఉండాలిగా.. అందుకే అదిరిపోయే కాంబో సెట్ చేస్తున్నాడు.. మరి సెంచరీ కోసం కింగ్ క్రియట్ చేయబోతున్న ఆ సెన్సేషన్ ఏంటి.
అక్కినేని నాగార్జున (Nagarjuna ) టాలీవుడ్ లో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో.. తెలుగు హీరోల్లో ఎవరూ చేయని ఎన్నో సాహసాలు చేశాడు. రొమాంటిక్ పాత్రల నుంచి యాక్షన్ రోల్స్ వరకూ, భావోద్వేగ సన్నివేశాల నుంచి ఆధ్యాత్మిక కథల వరకూ, ఆయన ప్రతి రకమైన సినిమాలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, టీవీ షోలతో అభిమానులను అలరిస్తూ తెలుగు సినిమా, ‘కింగ్’ సంచలనం సృష్టిస్తున్నాడు. అలాంటి వెర్సటైల్ స్టార్.. ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు.
నాగార్జున అతి త్వరలో 100వ సినిమా మైలు రాయికి చేరుకోబోతున్నాడు. ఈ మూవీతో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ లో మైలు రాయిగా నిలవబోతున్న ఈ సినిమాకు అంతే మెమోరేబుల్ గా ఉండేలా చూసుకోబోతున్నాడు. ఇంటర్నల్ టాక్ ప్రకారం.. ఈ స్పెషల్ 100వ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra.Karthik) దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తీక్.. కోలీవుడ్ లో ఓ స్పెషల్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ . తనదైన విభిన్నమైన కథలు, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కాంబో గురించి తెలిసిన ఫ్యాన్స్ ఎగ్జయిట్ గా ఫీల్ అవుతున్నాడు. నాగార్జున ఈ చిత్రాన్ని 2026 మేలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 100వ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Read Also: Deepavali: ఎట్టకేలకు అక్టోబర్ 10న 'ఎర్రచీర'
Read Also: Krithi Shetty: ఉప్పెన భామ.. హిట్ అందుకొనే తరుణం ఎప్పుడో