Sandeep Vanga: అనంతిక, సందీప్ రెడ్డి వంగా.. వాట్ ఏ కాంబినేషన్
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:29 PM
సందీప్ వంగా రెడ్డి సినిమా బ్యూటీ ఎవరో ఫైనల్లీ తేలిపోయింది. ఎందరో పేర్లు తెరపైకి వచ్చినా.. చివరికి ఆ బ్యూటీ దగ్గర సెర్చింగ్ అగిపోయింది. సందీప్ సినిమా హీరోయిన్ అంటేనే అదే రేంజ్ ఉంటుంది.. మరి తన సినిమా కోసం ఎవరిని ఎంచుకున్నాడు.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) తనదైన రా ఎమోషన్స్ టేకింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. తెలుగులో 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy ) , బీటౌన్ లో కబీర్ సింగ్ (Kabir Singh) , యానిమల్ (Animal ) మూవీలతో దుమ్మురేపాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) అనే భారీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. అయితే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఓ సినిమాతో లక్ ను పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ విషయం బయటకు వచ్చింది కానీ హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
సందీప్ నిర్మాతగా రూపొందిస్తున్న కొత్త సినిమాలో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లతో పాపులర్ అయి, ‘మేమ్ ఫేమస్’ (Mem Famous) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా ఎంపికయ్యాడు. ఇక ఇందులో హీరోయిన్ పై మల్లగుల్లాలుపడ్డారు. చివరికి ‘8 వసంతాలు’ (8 Vasanthalu) సినిమాతో యువతను ఆకర్షించిన నటి అనంతిక సనిల్ కుమార్ ( Anantika Saneel Kumar ) ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనంతిక యూత్‌ఫుల్ పాత్రల్లో తన టాలెంట్ చాటుకుంది. ఈ సినిమా ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది, ఇందులో కొత్త నటీనటులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
సందీప్ రెడ్డి వంగా, ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వ్యక్తిగా, తన సినిమాల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటాడు. సుమంత్, అనంతిక వంటి యువ నటీనటులను ఎంచుకోవడం ద్వారా ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. చూడాలి మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి హిట్ కొడతాడో..
Read Also: Power Star: పవన్ కళ్యాణ్ ఓజీకి తెలంగాణలో ఎదురుదెబ్బ...
Read Also: Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్లన్న అన్నది ఎవరిని.. ?