సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

IFFI: మొన్న చిరంజీవి... నేడు బాలకృష్ణ... ఇఫీలో తెలుగు తారల వైభోగం...

ABN, Publish Date - Nov 17 , 2025 | 01:44 PM

నవంబర్ 20న గోవాలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలు కాబోతోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణను ఘనంగా సత్కరించబోతున్నారు.

Nandamuri Balakrishna

ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తెలుగు వారికి సరైన ప్రాధాన్యత లభిస్తుండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. యావత్ భారత సినీ రంగం తెలుగు వారివైపు ఆసక్తిగా చూస్తున్నాయి. తెలుగు సినిమాలే ఇవాళ జాతీయ స్థాయిలో దిశా నిర్దేశం చేస్తున్నాయి. అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా సత్తాను చాటుతోంది కూడా తెలుగు సినిమాలే! ఈ నేపథ్యంలో తెలుగు సినిమా రంగానికి చెందిన కథానాయకులకు, దర్శకులకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తగిన గుర్తింపు లభిస్తోంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఇఫీ IFFI) వేదికపై ఘనంగా సత్కరించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను సత్కరించబోతున్నారు.


నవంబర్ 20న గోవా (Goa)లో 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం కానుంది. ఈ ఆరంభ వేడుకల్లోనే బాలకృష్ణను ఘనంగా సత్కరించబోతున్నారు. ఐదు దశాబ్దాల పాటు నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో హీరోగా రాణిస్తున్నారు. నందమూరి తారక రామారావు (Nandamuri Tharaka Ramarao) నట వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ మడమ తిప్పకుండా యాభై సంవత్సరాలు ముందుకు సాగుతున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవల కారణంగా ఈ సత్కారం జరుగబోతోంది. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కరాన్ని సైతం బాలకృష్ణ ఇటీవల అందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా క్యాన్సర్ చికిత్స, పరిశోధన రంగంలో బాలకృష్ణ విశేష సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా, మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో పదేళ్లకు పైగా కీలక పాత్ర పోషిస్తున్నారాయన.

Also Read: Sai durga tej: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నతేజ్‌.. పెళ్లిపై క్లారిటీ...

Also Read: Vijayendra Prasad: శ్రీలేఖ స్వరపర్చి పాడిన 'మా చిన్ని శివ'...

Updated Date - Nov 17 , 2025 | 01:45 PM