Sai durga tej: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నతేజ్.. పెళ్లిపై క్లారిటీ..
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:10 PM
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga tej) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ బ్రేక్‌లో ఆయన స్వామిని సేవించుకున్నారు.
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga tej) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ బ్రేక్‌లో ఆయన స్వామిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెళ్లిపై వస్తున్న రూమర్‌లకు చెక్ (Marriage rumors) పెట్టారు తేజ్.
‘చక్కని సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చాను. కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నాను. వచ్చే ఏడాదిలో నేను నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu) విడుదలవుతుంది. ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
పెళ్లిపై వస్తున్న రూమర్లపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ‘వచ్చే ఏడాదిలోనే నా పెళ్లి ఉంటుంది’ అని సమాధానమిచ్చారు తేజ్. ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ‘తన జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా ఇదని, అందరి అంచనాల్ని అందుకునేలా కష్టపడుతున్నానని సాయితేజ్ ఇటీవల ఓ వేదికపై తెలిపారు.