Film Federation of India: ఫిల్మ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా...

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:16 PM

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ భూషణ్ ఎన్నిక చిత్రసీమకు ఆయన ఎంతో కాలంగా అందిస్తున్న సేవలకు, నిజాయితీకి, అంకితభావానికి లభించిన సముచిత గౌరవమని తెలుగు సినిమా రంగ ప్రముఖులు తెలిపారు.

Bharat Bhushan

సినిమాలపై మక్కువతో 27 సంవత్సరాలుగా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు పి. భరత్ భూషణ్‌ (Bharat Bhushan). ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ఘనత ఆయనది. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారాయన. ఈ విధంగా చిత్ర పరిశ్రమకు భరత్ భూషణ్ తన వంతు అండగా నిలబడి తెలుగు ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber) ప్రెసిడెంట్ గానూ సేవలు అందిస్తున్నారు. ఈ పదవిలో తనదైన శైలిలో అటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి చోట ఆయన కలగజేసుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ వస్తున్నారు. కార్మికులకు, పంపిణీదారులకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి. భరత్ భూషణ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

Also Read: Raj kundra: చీకట్లోనే ఉండండి.. ట్రోల్‌ చేస్తూ జీవించండి..

Also Read: Arjun Sarja: ఆటిజంపై అవగాహాన కలిగించే 'మఫ్టీ పోలీస్'

Updated Date - Nov 20 , 2025 | 04:23 PM