Raj kundra: చీకట్లోనే ఉండండి.. ట్రోల్‌ చేస్తూ జీవించండి..

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:13 PM

శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! ఈ జంట మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు.

శిల్పాశెట్టి(Shilpa Shetty), రాజ్‌ కుంద్రా (Raj kundra) దంపతులు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి,  రాజ్‌ కుంద్రాలపై దీపక్‌ కొఠారి  ఫిర్యాదు చేయగా శిల్పా శెట్టి దంపతులపై జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ జంట మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఇటీవల శిల్పాశెట్టి బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కలిసి ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక పాదయాత్రలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ కొందరు ట్రోల్‌ చేయడం మొదలెట్టారు. ‘ఇందులో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీలపై కేసులు ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఇలా పాదయాత్రలు చేస్తున్నారు’ అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై రాజ్‌కుంద్రా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు.


‘చీకట్లోనే ఉండాలనుకునేవారు ఎంతకాలమైనా ఇలా నిందలు వేస్తూనే ఉంటారు. ఇలా ట్రోల్‌ చేేస వారంతా ఆరోపణలు, నేరారోపణలు ఒకటి కావు అని ఎప్పుడు తెలుసుకుంటారో. కొందరు ఎప్పుడూ శాంతిని కోరుకుంటారు. మరికొందరు ఎప్పటికీ ఇలా ట్రోల్‌ చేస్తూనే ఉంటారు. సనాతన ధర్మం కోసం నిలబడటం, భక్తిని ప్రదర్శించడం, ఆధ్యాత్మిక లక్ష్యానికి మద్దతు ఇవ్వడం మిమ్మల్ని బాధ పెడుతుంటే సమస్య మీలోనే ఉన్నట్లు అర్థం. మాకు అలాంటి విషయాలు ఎప్పటికీ సమస్యగా అనిపించవు. ఎవరి మీదైనా కేసులు ఉంటే దానిని చట్టం చూసుకుంటుంది. నిజం బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు మీలాంటివారు ఇలా స్ర్కీన్‌షాట్‌లు తీసుకుని పోస్ట్‌లు చేస్తూ జీవించండి’ అని రాజ్‌కుంద్రా ట్రోలర్స్‌ ఘాటుగా రిప్లై ఇచ్చారు.  

Updated Date - Nov 20 , 2025 | 04:14 PM