Sunny Leon: హాలీవుడ్ చిత్రంలో పోర్న్ స్టార్... సోల్జర్ అవతారమెత్తిన సెక్సీ భామ

ABN , Publish Date - May 27 , 2025 | 01:03 PM

శృంగార నాయిక సన్నీలియోన్ సినిమాలు విడుదలై చాలా రోజులైంది. తాజాగా ఆమె ఓ హాలీవుడ్ చిత్రంలో సోల్జర్ పాత్రను పోషిస్తోందట.

శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leon) ఇప్పుడు భిన్నమైన చిత్రాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కాస్తంత రూట్ మార్చి కొన్నేళ్ళ క్రితం బాలీవుడ్ (Bollywood) బాట పట్టింది. అంతేకాదు... తెలుగులోనూ కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించింది. రాజశేఖర్ (Rajasekhar) సినిమాలోనే కాకుండా మంచు బ్రదర్స్ విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) చిత్రాలలో సన్నిలియోన్ నటించింది. అలానే ఇతర భాషాచిత్రాలలోనూ సందడి చేసింది.


ప్రస్తుతం ఆమె ఫిల్మ్ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ఒకటి చేస్తోంది. అదే హాలీవుడ్ మూవీ. ఇప్పటి వరకూ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తన ఇమేజ్ కు తగ్గ పాత్రలనే వెండితెర మీద కూడా చేసింది. అయితే ఇది అందుకు పూర్తి భిన్నమైన పాత్ర అని తెలుస్తోంది. యుద్థం కారణంగా దెబ్బ తిన్న దేశంలో యు.ఎన్. శాంతి బృందంలో సైనికురాలి పాత్రను ఆమె చేస్తోందట. సోల్జర్ దుస్తుల్లో ఉన్న సన్నిలియోన్ ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో సన్నిలియోన్ పోషించే పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఆమెకు ఈ సినిమాతో ఓ సరికొత్త ఇమేజ్ లభించబోతోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా సన్నీ లియోన్ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. కొన్ని ఇప్పటికీ సెట్స్ మీద ఉన్నాయి. అయితే సన్నీలియోన్ చివరిసారిగా ఎంటీవీ డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్ విల్లా ఎక్స్ 5లో కనిపించింది.

Also Read: Bhairavam: మాస్ కమర్షియల్ హీరోగా బెల్లంకొండ...

Also Read: Dhadak 2: త్రిప్తి డిమ్రీ మూవీ వచ్చేది ఎప్పుడంటే...

Also Read: Spirit: సందీప్ రెడ్డి వంగాకు కోపమొచ్చింది...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 27 , 2025 | 04:34 PM