Dhadak 2: త్రిప్తి డిమ్రీ మూవీ వచ్చేది ఎప్పుడంటే...

ABN , Publish Date - May 27 , 2025 | 11:54 AM

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 'థడక్' మూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. త్రిప్తీ డిమ్రీ నటించిన ఈ సీక్వెల్ ఆగస్ట్ 1న జనం ముందుకు వస్తోంది.

ప్రముఖ నటి, స్వర్గీయ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా పరిచయం అయిన సినిమా 'ధడక్' (Dhadak). అయితే... జాన్వీ లేకుండానే ఆ సినిమాకు సీక్వెల్ కు రూపుదిద్దుకుంది. సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi), త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) జంటగా ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ (Karan Johar) ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కరణ్‌ జోహార్ ప్రకటించాడు. ఆగస్ట్ 1న 'ధడక్ -2' జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో 'చావడమో, పోరాటం చేయడమో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వస్తే పోరాడు' అనే కాప్షన్ ను దానిపై ముద్రించారు. ప్రేమకోసం చనిపోవడం కాకుండా దానిని దక్కించుకోవడానికి పోరాడాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమౌతోంది. తాజాగా విడుదల చేసి రెండు పోస్టర్స్ లో ఒక దానిలో హీరో సిద్ధాంత్ చతుర్వేది ఫేస్, రెండో దానిలో త్రిప్తి డిమ్రీ ఫేస్ కనిపిస్తున్నాయి.


'ధడక్ -2' మూవీ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుంది. పదహారు కట్స్ ఇచ్చి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ధడక్ -2' సినిమాను కూడా కులాంతర ప్రేమ వివాహం నేపథ్యంలోనే తెరకెక్కించినట్టు సెన్సార్ కట్స్ ను చూస్తుంటే అర్థమౌతోంది. మరి 'ధడక్' సాధించిన విజయాన్ని ఈ సీక్వెల్ చేజిక్కించుకుంటుందో లేదో చూడాలి.

Also Read: Spirit: సందీప్ రెడ్డి వంగాకు కోపమొచ్చింది...

Also Read: Thudarum OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. కేర‌ళ‌ను షేక్ చేసిన లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌! ఎందులో.. ఎప్ప‌టి నుంచంటే?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 27 , 2025 | 12:08 PM