సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hollywood Chamber of Commerce: దీపికా పదుకొణే రేర్ రికార్డ్

ABN, Publish Date - Jul 03 , 2025 | 02:48 PM

దీపికా పదుకొణే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించడమే కాదు.... అంతర్జాతీయంగానూ ఖ్యాతిని గడిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) సైతం ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మాదిరి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకుంటోంది. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా పదుకొణే కు ఏ భారతీయ నటికి దక్కని గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కు దీపిక ఎంపికయ్యింది. ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ ఆడమ్స్, స్టాన్లీ టక్కీ లాంటి హాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు దీపికా పదుకొణే పేరు కూడా ఉండటం ఆమె అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తేలా చేసింది.


హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కింద 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయగా, అందులో దీపికా పదుకొణే కూ చోటు దక్కింది. వినోద రంగంలో విశేషమైన కృషి చేసిన సందర్భంలో వీరిని ఎంపిక చేసినట్టు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఇప్పటికే దీపికా పదుకొణే 2018లో టైమ్స్ మేగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో ఉంది. అలానే 2022లో ఫిఫా వరల్డ్ కప్ ను ఆవిష్కరించి యావత్ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిలోనూ దీపికా పడింది. 2023లో దీపికా పదుకొణే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో 'ఆర్ఆర్ఆర్' మూవీలోని నాటు నాటు సాంగ్ ను ఆడియెన్స్ కు పరిచయం చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే... మొదటిసారి తెలుగులో 'కల్కి 2898 ఎ.డి' (Kalki 2898 A.D.) లో చేసిన దీపికా దాని సీక్వెల్ లోనూ నటిస్తోంది. అలానే అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కబోతున్న యాక్షన్ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: RamayanaThe Introduction: మన వాస్తవం.. మన చరిత్ర..

Also Read: Tollywood: నైజాం ఏరియా పంపిణీలో మారుతున్న సమీకరణాలు

Updated Date - Jul 03 , 2025 | 02:48 PM