సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Narain Karthikeyan: ఆ రీమేక్‌లో నటించేందుకు అజిత్‌ మాత్రమే అర్హుడు

ABN, Publish Date - Sep 11 , 2025 | 12:32 PM

హలీవుడ్‌ మూవీ ‘ఎఫ్‌-1’ తమిళ్‌ రీమేక్‌లో నటించేందుకు  అజిత్‌ మాత్రమే అర్హుడని ప్రముఖ రేసర్‌ నరేన్‌ కార్తికేయన్‌ అభిప్రాయపడ్డారు.

Ajith Kumar

హలీవుడ్‌ మూవీ ‘ఎఫ్‌-1’ (F1) తమిళ్‌ రీమేక్‌లో నటించేందుకు  అజిత్‌ (Ajith Kumar)మాత్రమే అర్హుడని ప్రముఖ రేసర్‌ నరేన్‌ కార్తికేయన్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘ఎఫ్‌-1’ హాలీవుడ్‌ మూవీ తమిళ రీమేక్‌లో ఎవరు నటిస్తే సరిపోతారని విలేకరులు ప్రశ్నించగా, ఆ పాత్రకు అజిత్‌ మాత్రమే సరిగ్గా సరిపోతారని (Narain Karthikeyan) అన్నారు.

ఐదు పదుల వయసులో కూడా అనేక పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ వయసులో కూడా ఆయనకు కార్‌ రేసింగ్‌ పోటీలపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆయన నేను పాతికేళ్లుగా స్నేహితులం. దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌కు మరింత ప్రాచూర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇపుడు ఆయనతో కలిసి నేనూ పని చేస్తున్నాను. మేమిద్దరం విజయాల కోసం శ్రమిస్తున్నాం’ అని నరేన్‌ కార్తికేయన్‌ చెప్పుకుంటూ వచ్చారు. 

READ ALSO: Tollywood Producer: పిటిషన్‌ వెనక్కి తీసుకోకుంటే చంపేస్తా.. నిర్మాత బెదిరింపులు

Folk Song: జాజిరిలాట‌లాడంగా.. మ‌రో మంచి ప‌ల్లె పాట వ‌చ్చింది

Kishkindhapuri: కిష్కింద‌పురి.. ప్రీమియ‌ర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా

Malavika Mohanan: ఇలాంటి అవకాశం ఎవరికైనా లభిస్తుందా

Updated Date - Sep 11 , 2025 | 12:47 PM