సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naresh Agastya: ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’  

ABN, Publish Date - Aug 09 , 2025 | 06:48 PM

నరేష్ అగ‌స్త్య‌(Naresh Agastya) , సంజ‌నా సార‌థి (Sanjana sarathi) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ ‘మరొక్కసారి’ (Marokkasari) . సి.కె.ఫిల్మ్ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.చంద్ర‌కాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Marokkasari movie


నరేష్ అగ‌స్త్య‌(Naresh Agastya) , సంజ‌నా సార‌థి (Sanjana sarathi) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ ‘మరొక్కసారి’ (Marokkasari) . సి.కె.ఫిల్మ్ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.చంద్ర‌కాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ లింగుట్ల దర్శకుడు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంటోంది. శనివారం  ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  మాట్లాడుతూ 'అందమైన ప్రేమ కథా చిత్రమిది  విజువల్స్ ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకు రాబోతోన్నాయి.  కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా కూడా షూటింగ్ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్ వంటి ప్రదేశంలో ఈ ‘మరొక్కసారి’ చిత్రీకరణ చేశాం. 5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌లో షూటింగ్ చేసిన ఏకైక ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది. భరత్ మాంచి రాజు  చక్కని  సంగీతాన్ని అందించారు. మొత్తంగా ఆరు పాటలుంటాయి.  కార్తిక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్  వంటి టాలీవుడ్ టాప్ సింగర్లు ఆలపించారు.   పాటల  చిత్రీకరణ కూడా పూర్తయింది.  తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అన్నారు.  

ALSO READ: Nithin: నితిన్‌తో పూజా..  విక్రమ్‌ సక్సెస్‌ మ్యాజిక్‌ వర్కవుట్‌ అవుతుందా..

Kantara: Chapter 1: కాంతార షూట్‌.. మరో మరణం.. కారణమేంటి

Federation Bandh: ఆ వార్తలు నమ్మోద్దంటున్న చిరు

Kantara: Chapter 1: కాంతార షూట్‌.. మరో మరణం.. కారణమేంటి


Updated Date - Aug 09 , 2025 | 06:48 PM