Nithin: నితిన్‌తో పూజా.. విక్రమ్ సక్సెస్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా..
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:06 AM
నితిన్(nithin), విక్రమ్ కె.కుమార్ కలయికలో ఇష్క్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే? ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నితిన్(nithin), విక్రమ్ కె.కుమార్ ((vikram k kumar) కలయికలో ఇష్క్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే? ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్ల వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కు ఈ చిత్రం హిట్ ఇచ్చింది. దాంతో నితిన్ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోన్న విషయం తెలిసిందే! యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో నితిన్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే నితిన్‌తో పూజా హెగ్డే కలిసి నటించడం ఇదే మొదటిసారి.
ఇప్పటికే మేకర్స్ పూజాతో చర్చలు మొదలుపెట్టారని తెలుస్తోంది. నితిన్ ఇప్పుడు మళ్లీ ఫ్లాపుల్లో ఉన్నాడు. తనకు విక్రమ్ మళ్లీ మంచి సినిమా ఇస్తాడని నమ్మకంతో ఉన్నారు నితిన్. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ. ఇందులో నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు. ‘స్వారీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇప్పటికూ కథ లాక్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పను?ని జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌కి వెళ్లబోతోందీ సినిమా.