Kantara: Chapter 1: కాంతార షూట్‌.. మరో మరణం.. కారణమేంటి

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:04 PM

కాంతార -1 (Kantara: Chapter 1) షూటింగ్‌లో వరుస మరణాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాంతార -1 (Kantara: Chapter 1) షూటింగ్‌లో వరుస మరణాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే నాలుగు చోట్ల నలుగురు టెక్నీషియన్లు వివిధ కారణాలతో మరణించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పని చేసిన మరో నటుడు మరణించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాటక కళాకారుడు టి ప్రభాకర్‌ కళ్యాణి గురువారం ఉదయం హిరియాడ్కాలోని తన నివాసంలో కుప్పకూలి మరణించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రిటైర్డ్‌ అయిన ప్రభాకర్‌ కాంతారాలో న్యాయవాది పాత్రను పోషించారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. ‘ప్రభాకర్‌ కళ్యాణి (Prabhakar Kalyani) ఇంట్లో జారిపడి చికిత్స పొందుతున్నాడు. సడెన్‌గా తన చేతులు, కాళ్లు నొప్పిగా ఉన్నాయని భార్యకు చెప్పగా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే ఆయన మరణించాడని’ కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు ఒక స్టేజ్‌ ఆర్టిస్ట్‌. కాంతార కోసం దాదాపు ఒక సంవత్సరంపాటు గడ్డం పెంచారు. అయితే చివరి నిమిషంలో తనకు మొదట కేటాయించిన పాత్రను వేరే నటుడికి ఇచ్చినప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం అతని అంత్యక్రియలు పూర్తయ్యాయి. (Rishab Shetty)

ALSO READ: Nithin: నితిన్‌తో పూజా..  విక్రమ్‌ సక్సెస్‌ మ్యాజిక్‌ వర్కవుట్‌ అవుతుందా..

కాంతారలో నటించిన పలువురు నటులు చాలా చిన్న వయసులో రకరకాల కారణాలతో మరణించడంతో టీమ్‌ షాక్‌కు గురైంది. అందుకు కారణం ఏంటనే దిశగా రిషబ్‌ శెట్టి ప్రయత్నాలు చేశారు. పలువరు పండితులను కలిసి అలా ఎందుకు జరుగుతుంది? పరిష్కార మార్గం చూపమని ఆయన పండితులను కోరినట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే రాకేష్‌ పూజారి (36), కపిల్‌ (32) మే నెలలో చనిపోయారు. జూన్‌లో కళాభవన్‌ మృతి చెందారు. ఇప్పుడు ప్రభాకర్‌ కళ్యాణి మృతి చెందడంతో కాంతార టీమ్‌తోపాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రిషబ్‌ శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్‌ -1 వస్తోంది.

Updated Date - Aug 09 , 2025 | 03:15 PM