సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

War -2: పరాజయంతో పునరాలోచన...

ABN, Publish Date - Aug 23 , 2025 | 03:58 PM

కథ, కథనాలలో కొత్తదనం లేని కారణంగా 'వార్ -2' పరాజయం పాలైంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నా... మేకర్స్ ను ఈ అంకెలేవీ ఆనందపర్చడం లేదు.

Yash Raj Films

యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) ను 'సైయారా' (Saiyaara) సినిమా క్లౌడ్ నైన్ లో నిలబెట్టింది. ఆ ఆనందాన్ని 'వార్ -2' (War-2) మూవీ పరాజయం భగ్నం చేసింది. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'వార్' (War) చక్కని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో 'వార్ -2'కు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన సైతం కలెక్షన్లను కొల్లగొట్టడానికి ఎన్టీఆర్ (NTR) ను తురుపు ముక్కగా యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎంచుకుంది. ప్రచారం వరకూ ఈ విషయంలో అది సక్సెస్ సాధించింది కానీ కథ, కథనాలలో కొత్తదనం లేని కారణంగా 'వార్ -2' పరాజయం పాలైంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నా... మేకర్స్ ను ఈ అంకెలేవీ ఆనందపర్చడం లేదు.


యశ్ రాజ్ ఫిలిమ్స్ గత కొంతకాలంగా స్పై యూనివర్స్ పేరుతో వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. అందులో భాగంగా వచ్చిన 'ఏక్ థా టైగర్ (Ek Tha Tiger), టైగర్ జిందా హై (Tiger Zinda Hai), వార్, పఠాన్ (Pathaan)' వంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే... ఆ తర్వాత ఇదే కోవలో వచ్చిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దానికి ఒకటే కారణం రొటీన్ కథ, కథనాలు. ఎంతసేపు శత్రదేశం పాకిస్తాన్ కుట్రలను మన ఏజెంట్స్ భగ్నం చేయడం మీదనే ఇవి సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. కనీసం కథనం కూడా కొత్తగా లేకపోవడంతో వారంతా వీటిని తిరస్కరించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు స్పై యూనివర్స్ పై సినిమాలు నిర్మించడమే ఇక బంద్ చేస్తే బెటరేమో అని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆలోచిస్తోందట. ఇప్పటికే ఈ బ్యానర్ లో ఈ యూనివర్స్ నుండి ఈ సారి లేడీ స్పై ఏజెంట్స్ తో 'ఆల్ఫా' (Alpha) సినిమాను తీస్తున్నారు. వాళ్ళను తాజాగా విడుదలైన 'వార్ 2'లోనూ చూపించారు. ఇక 'ఆల్ఫా' మూవీతో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది.

Also Read: Mirai: హనుమాన్ హీరోకు పెద్ద సమస్యే వచ్చి పడిందే...

Also Read: Pradeep Ranganathan: దీపావళి రేస్ లో రెండు సినిమాలు

Updated Date - Aug 23 , 2025 | 04:06 PM