సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Emraan Hashmi: కొందరు హీరోలు సెట్ కు కూడా రారు.. ఓజీనే అన్నాడా

ABN, Publish Date - Oct 28 , 2025 | 04:55 PM

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emaraan Hashmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ (OG) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

Emraan Hashmi

Emraan Hashmi: బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emaraan Hashmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ (OG) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒమీ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సెప్టెంబర్ 25 న రిలీజ్ అయిన ఓజీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ఇమ్రాన్ కు తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఇమ్రాన్.. హాక్ సినిమాలో నటిస్తున్నాడు. యామి గౌతమ్, ఇమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఇమ్రాన్ - యామి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో కొంతమంది నటులు సెట్స్ కు అస్సలు రారు అని చెప్పుకొచ్చాడు. యామి గౌతమ్ టైమ్ సెన్స్ ను ప్రశంసిస్తూ ఇమ్రాన్ మాట్లాడుతూ.. 'సెట్ కు టైమ్ అంటే టైమ్ కు వచ్చేవాళ్లను నేను ఇష్టపడతాను. నాలాగే సమయానికి వచ్చే అతికొద్దిమంది వారిలో యామి ఒకరు. కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక వెంటనే యాంకర్.. ఈరోజుల్లో కూడా నటులు సెట్ కి ఆలస్యంగా వస్తారా అని అడగ్గా తడుముకోకుండా ఇమ్రాన్.. 'అరే కొంతమంది నటులు సెట్‌లకు అస్సలు రారు' అని చెప్పి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు అని అందరు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొందరు సల్మాన్ ఖాన్ ని అన్నాడు అంటే.. ఇంకొందరు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నాడు అని అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.

Khaidi: తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన సినిమా

Kantara Vs Lokah: ఒకేరోజు ఓటీటీలో రెండు హిట్ సినిమాలు..

Updated Date - Oct 28 , 2025 | 05:16 PM