Kantara Vs Lokah: ఒకేరోజు ఓటీటీలో రెండు హిట్ సినిమాలు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:21 PM
ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే హిట్స్ గా నిలిచాయి. వాటిల్లో లోక చాప్టర్ 1 (Lokah Chapter 1), కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)ముందు వరుసలో ఉంటాయి.
Kantara Vs Lokah: ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే హిట్స్ గా నిలిచాయి. వాటిల్లో లోక చాప్టర్ 1 (Lokah Chapter 1), కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)ముందు వరుసలో ఉంటాయి. రిషభ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' పాన్ ఇండియా మూవీగా రిలీజై దేశంలోనే టాప్ గ్రాసర్ గా నిలచింది. ఇక మళయాళంలో కళ్యాణీ ప్రియదర్శన్ తో డోమ్నిక్ అరుణ్ తెరకెక్కించిన 'లోకా చాప్టర్ 1' కూడా పాన్ ఇండియా సినిమాగానే జనం ముందు నిలచింది. ఈ చిత్రం కేరళలో నంబర్ వన్ గ్రాసర్ అనిపించుకుంది. ఆగస్టు 28వ తేదీన 'లోకా చాప్టర్ వన్' రిలీజ్ కాగా, అక్టోబర్ 2వ తేదీన 'కాంతార చాప్టర్ 1' ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 31వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మెరవనుండటం విశేషంగా మారింది. జియో హాట్ స్టార్ లో 'లోకా' స్ట్రీమింగ్ కానుండగా, ప్రైమ్ వీడియోలో 'కాంతార చాప్టర్ 1' సందడి చేయనుంది.
నిస్సందేహంగా ఈ యేడాది ఆల్ ఇండియాలో టాప్ గ్రాసర్ గా నిలచిన చిత్రం 'కాంతార చాప్టర్ 1' అనే చెప్పాలి... ఈ సినిమా ఇప్పటి దాకా దాదాపు 850 కోట్లు పోగేసిందని తెలుస్తోంది... ఇక 'లోకా చాప్టర్ 1' మూవీ విషయానికి వస్తే టోటల్ గా 300 కోట్లు చూసింది. అయితే లెక్కలు చూస్తే 'లోకా'దే పైచేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 30 కోట్ల రూపాయలతో రూపొందిన 'లోకా చాప్టర్1' మూవీ 300 కోట్లు పోగేసింది. అంటే పెట్టుబడికంటే 10 రెట్లు అధికంగా సాధించింది. 'కాంతార చాప్టర్ 1' బంపర్ హిట్ అయినా ఈ నిష్పత్తిలో లాభాలు చూడలేదు.
'కాంతార చాప్టర్ 1' విషయానికి వస్తే ఈ సినిమా 125 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటి దాకా 850 కోట్లు మూటకట్టింది. అంటే 6.8 రెట్లు 'కాంతార చాప్టర్ 1' వసూళ్ళు చూసింది. సూపర్ హీరో మూవీగా రూపొందిన 'లోకా' అమ్మాయి చుట్టూ తిరిగే కథ కాగా, 'కాంతార' హీరో ప్రధానంగా సాగే స్టోరీ. రెండు సినిమాలు సూపర్ నేచురల్ పవర్స్ తో రూపొందాయి. దేనికదే మంచి ఆదరణ చూరగొన్నాయి. అందువల్ల సినిమా థియేటర్స్ లో మూవీస్ చూడనివారు, ఓటీటీలో చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పైగా రెండు సినిమాలు ఒకే రోజున వేర్వేరు ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. దాంతో ఈ రెండు చిత్రాల రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలనీ సినీఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మరి ఏ సినిమా ఓటీటీ రేటింగ్స్ లో పై చేయి సాధిస్తుందో చూడాలి.
OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Satya: సత్య హీరోగా 'మత్తు వదలరా' దర్శకుడి సినిమా....