Nara Rohith: సీఎం రేవంత్ రెడ్డికి.. వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన నారా రోహిత్
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:51 PM
టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. తన ప్రేయసి శిరీష తో (Sirisha Lella) ఆయన కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. తన ప్రేయసి శిరీష తో (Sirisha Lella) ఆయన కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రికలు పంచడం మొదలుపెట్టారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (TG CM Revanth Reddy) కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు నారా రోహిత్. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ 25న హల్దీ వేడుకతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది. 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కుమారుడిని చేస్తారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అక్టోబర్ 28న మెహందీ వేడుకను ఎంతో సందడిగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ALSO READ: Bison Review: ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ డ్రామా 'బైసన్' ఎలా ఉందంటే
Vicky Kaushal: ఆలస్యంగా పరశురాముడి ఆగమనం...
Tollywood: సినీ కార్మికుల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం