Rashmika Mandanna: థామా సాంగ్.. మరోసారి రెచ్చిపోయిన రష్మిక..
ABN, Publish Date - Sep 29 , 2025 | 04:51 PM
ఈమధ్యకాలంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) అందాల ఆరబోతకు హద్దు ఉండడం లేదు. ఒకప్పుడు ఇంతలా ఆమె అందాలను ఆరబోయలేదు.
Rashmika Mandanna: ఈమధ్యకాలంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) అందాల ఆరబోతకు హద్దు ఉండడం లేదు. ఒకప్పుడు ఇంతలా ఆమె అందాలను ఆరబోయలేదు. ముఖ్యంగా యానిమల్, పుష్ప2 సినిమాల్లో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అందులో ఇంకా చెప్పాలంటే పుష్ప 2 లో వస్తున్నాయి పీలింగ్స్ సాంగ్ లో రష్మిక చేసిన అందాల ఆరబోత అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు లేనిది రష్మిక ఈ రేంజ్ గా రెచ్చిపోయిందేంటి అని కూడా అప్పుడు నెటిజన్స్ మాట్లాడుకున్నారు.
ఇక ఇప్పుడు మరోసారి రష్మిక రెచ్చిపోయింది. ఈసారి బాలీవుడ్ సినిమా థామా కోసం. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థామా. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
డ్రాకులా కథల నేపథ్యంలో ఈ సినిమా హర్రర్ కామెడీగా తెరకెక్కిన థామా అక్టోబర్ 21 న రిలీజ్ కు సిద్ధమౌతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తుమ్ మేరే నా హుయే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రష్మిక డిజైనర్ డ్రెస్ లో అదిరిపోయింది. ఎద అందాలను ఒకపక్క థైస్ అందాలను మరోపక్క ఎరగా వేస్తూ స్టెప్స్ తో అదరగొట్టేసింది. ఇక ఆయుష్మాన్ తో అమ్మడి పెదవి ముద్దులు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. పీలింగ్స్ సాంగ్ మించి ఉందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Sudigali Sudheer: గాలోడు.. ఇప్పుడు హైలెస్సో అంటూ వస్తున్నాడు
Allu Arjun: బన్నీ సినిమా.. జపనీస్ కొరియోగ్రాఫర్ హోక్ పోస్ట్ వైరల్